Ads
పెళ్లీడుకొచ్చిన కూతురు ఉంటె ఏ తండ్రి అయినా తన కూతురుకి తగిన సంబంధం వెదికి పెళ్లి చేయాలనీ అనుకుంటాడు. అలానే ఈ తండ్రి కూడా తన కూతురుకి మాట్రిమోనియల్ సైట్ నుంచి ఓ మంచి కుర్రాడిని వెదికి పెట్టాడు. ఆ అబ్బాయి డిటైయిల్స్ ను, ప్రొఫైల్ ను కూతురుకు చూపించాడు. అయితే.. ఆ అబ్బాయి ప్రొఫైల్ ను చూసిన అమ్మాయి అతని జాబ్ డీటెయిల్స్ చూసి, అతని టాలెంట్ కి ఫిదా అయ్యి తన కంపెనీలోనే జాబ్ ఇచ్చింది.
Video Advertisement
వివరాల్లోకి వెళితే, బెంగళూరుకు చెందిన ఉదితా పాల్ ఓ స్టార్ట్అప్ కంపెనీ లో కో-ఫౌండర్ గా ఉంది. ఆమెకు పెళ్లి చేయాలనీ ఆమె తండ్రి భావించారు. అందుకోసం వరుడిని వెదికారు.
అందుకోసం మాట్రిమోనియల్ సైట్స్ లలో ఆ అమ్మాయికి తగిన వరుడి కోసం వెదికాడు. చివరకు ఓ అబ్బాయి నచ్చడంతో ఆ అబ్బాయి డీటెయిల్స్ ను కూతురికి చూపించాడు. ఈ డీటెయిల్స్ ను వాట్సాప్ ద్వారా అందించాడు. అయితే మాట్రిమోనియల్ సైట్స్ లలో సదరు వ్యక్తుల ప్రొఫెషనల్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. వాటిని చూసి ఫిదా అయిన ఉదితా పెళ్లి సంగతి పక్కన పడేసి.. తన కంపెనీ లో జాబ్ ఆఫర్ ఉందని, అతని క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ సరిపోతాయని, ఇంటరెస్ట్ ఉంటె ఇంటర్వ్యూ లింక్ ద్వారా అటెండ్ అవ్వాలని తెలిపింది. ఇంటరెస్ట్ ఉంటె రెజ్యూమ్ పంపాలని కోరింది.
అయితే ఇది తెలుసుకున్న ఉదితా పాల్ తండ్రి షాక్ అయ్యాడు. మాట్రిమోనియల్ లోని వ్యక్తులకు జాబ్ ఆఫర్లు ఇవ్వడం కాదని, పెళ్లి చేసుకోవడం కోసమే ఆ అబ్బాయి డీటెయిల్స్ ఇచ్చానని చెప్పుకొచ్చాడు. అయితే.. తన తండ్రి వాట్సాప్ లో చెప్పిన మాటలను ఉదితా స్క్రీన్ షాట్ తీసి నెట్టింట్లో పంచుకున్నారు. ఇప్పుడు ఈ ట్వీట్ ను చూసుకుని నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయిపొయింది.
What getting disowned from father looks like. pic.twitter.com/nZLOslDUjq
— Udita Pal 🧂 (@i_Udita) April 29, 2022
End of Article