Ads
సినిమాల్లోకి వచ్చే ముందు ఆ రంగానికి చెందిన వాళ్లు అందరూ చాలా కష్టాలు పడతారు. చిన్న చిన్న పాత్రల్లో నటించి లేదా కెమెరా వెనకాల పని చేసి ఇప్పుడు పెద్ద స్థాయికి ఎదిగిన నటులు ఎంతోమంది ఉన్నారు. ఇదేవిధంగా, ఇటీవల కాలంలో పేరు తెచ్చుకుంటున్న కొంతమంది నటులు కూడా కూడా సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించారు.
Video Advertisement
వివరాల్లోకి వెళితే నాని, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా మిడిల్ క్లాస్ అబ్బాయి. ఈ సినిమాకి శ్రీరామ్ వేణు దర్శకత్వం వహించారు. ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు.
నాని కెరీర్ లో కమర్షియల్ ఎంటర్టైనర్స్ లో ఒకటిగా ఈ సినిమా నిలిచింది. కలెక్షన్స్ పరంగా కూడా ఈ సినిమా మంచి లాభాలను తెచ్చి పెట్టింది. చాలా సంవత్సరాల తర్వాత ఈ సినిమాతో భూమిక మళ్లీ సినిమాల్లో నటించడం మొదలు పెట్టారు. ఇందులో నానికి వదినగా భూమిక నటించారు. ఇందులో మరొక ముఖ్య పాత్రలో రాజీవ్ కనకాల, అలాగే హీరోకి బాబాయ్, పిన్నిగా నరేష్, ఆమని నటించారు.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో ఒక బిగ్ బాస్ తెలుగు కంటెస్టెంట్ ఒక చిన్న రోల్ లో నటించారు. బిగ్ బాస్ తెలుగు సీజన్ ఫైవ్ లో ఫైనల్ వరకు వచ్చిన సిరి ఈ సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించారు. కేవలం ఒక్క సీన్ లో సిరి కనిపిస్తారు. హీరో ఉద్యోగంలో చేరిన తర్వాత హీరోయిన్ హీరోని ఒకసారి అనుకోకుండా కలుస్తుంది. అప్పుడు హీరోయిన్ తన ఫ్రెండ్స్ తో ఉంటుంది. ఆ ఫ్రెండ్స్ లో ఒకరిగా సిరి కనిపించారు. కానీ కేవలం సిరి ఆ ఒక్క సీన్ లో మాత్రమే కనిపిస్తారు. ఆ తర్వాత సినిమాలో మరెక్కడా కనిపించరు. కానీ ఇటీవల కాలంలో సిరి చాలా సినిమాల్లో, అలాగే యూట్యూబ్ వెబ్ సిరీస్ లో కూడా కనిపిస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు తర్వాత ఇంకా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం సినిమాల్లో అలాగే సిరీస్ లో నటిస్తున్నారు.
End of Article