కోట్లు సంపాదించాలంటే ఇలా చేయండి.. సింపుల్ సూత్రం చెప్పిన ఎలాన్ మస్క్..!

కోట్లు సంపాదించాలంటే ఇలా చేయండి.. సింపుల్ సూత్రం చెప్పిన ఎలాన్ మస్క్..!

by Anudeep

Ads

డబ్బెవరికి చేదు. ఎంత సంపాదించినా ఇంకా సంపాదించుకోవాలి.. భవిష్యత్ కోసం జాగ్రత్త పడాలి అన్న తపన అందరికి ఉంటుంది. అయితే.. ఎవరి శక్తియుక్తులు, తెలివి తేటలను బట్టి వారు సంపాదించుకోగలుగుతారు. అయితే కొందరు మాత్రం అనతి కాలంలోనే బాగా స్థిరపడిపోతుంటారు.

Video Advertisement

వ్యాపారాల్లో రాణిస్తూ కోట్లు గడిస్తుంటారు. అయితే ఇది అందరికి సాధ్యం కాదు. కొందరు మాత్రమే ఇలా ఎలా చేయగలుగుతున్నారు అంటే.. వారికంటూ ప్రత్యేక సూత్రాలు, వారిపై వారికి నమ్మకం ఉండడమే కారణం.

elon musk 1

ఇలా కోట్లకు పడగలెత్తిన బిజినెస్ మ్యాన్స్ లో ఎలాన్ మాస్క్ కూడా ఒకరు. ఇటీవలే ఈయన ట్విట్టర్ ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. చిన్న వయసు నుంచే తెలివి తేటలు కలిగిన మస్క్ మిలియన్ల కొద్దీ డాలర్లు సంపాదించారు. ఆయన వ్యాపారంలో ఆయన చూపిన మెళకువలే ఆయన విజ్ఞానానికి నిదర్శనం. ఈరోజు ఆయన నుంచి ఆర్ధిక పాఠాలు నేర్చుకోవాలని ఎందరో ఎదురు చూస్తున్నారు.

elon musk 2

ఈ క్రమంలో స్టాక్ మార్కెట్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి అన్న విషయమై ఎలాన్ మస్క్ ఓ సింపుల్ సూత్రం చెప్పుకొచ్చారు. ఈ సింపుల్ సూత్రాన్ని ట్విట్టర్ మాధ్యమంగా తెలిపారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అయింది. “స్టాక్ మార్కెట్ లో ఎర్నింగ్ గురించి నన్ను చాలా మంది అడుగుతుండడం వల్లే స్పందిస్తున్నానని, ఏ కంపెనీలు అయితే ప్రొడక్ట్స్ తయారు చేస్తాయో.. లేక సర్వీసెస్ ను ఆఫర్ చేస్తాయో అటువంటి కంపెనీలపై మీకు నమ్మకం ఉంటె ఇన్వెస్ట్ చేయాలనీ” సూచించారు.

elon musk 3

అయితే మీరు ఇన్వెస్ట్ చేస్తున్న కంపెనీలు వరస్ట్ గా మారుతున్నాయి అని మీకు అనిపించినప్పుడు వాటి స్టాక్స్ ను అమ్మేసుకోవడం ఉత్తమం. మిగతా సమయంలో సేల్ చేయకుండా ఉండండి. ఒక్కోసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. ఆ సమయంలో కంగారు పడకుండా హేండిల్ చేయండి. షేర్స్ అమ్మేటప్పుడు మీకు పూర్తి క్లారిటీ ఉంటేనే ఆ పని చేయండి. దీని వలన దీర్ఘకాలంలో లాభాలు కలుగుతాయని అన్నారు. కొందరు తక్కువ టైం లోనే ఎక్కువగా ఆర్జించేయాలనుకుంటారు. ఇది మాత్రం నష్టాల పాలు చేస్తుంది.


End of Article

You may also like