Ads
ఒక సినిమాకి హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ వీటితో పాటు ఇంపార్టెంట్ అయినది ఒక డైరెక్టర్, ఇంకా ఆ డైరెక్టర్ విజన్. ఆ డైరెక్టర్ టేకింగ్ ఎంత బాగుంటే సినిమా అంత హిట్ అవుతుంది అనే విషయం మన అందరికీ తెలుసు. ప్రతి డైరెక్టర్ కి ఒక డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది. కథని ట్రీట్ చేసే విధానం కూడా డిఫరెంట్ గా ఉంటుంది.
Video Advertisement
అందుకే ఒక్కొక్కసారి కథ మామూలుదే అయినా కూడా డైరెక్టర్ టేకింగ్ వల్ల సినిమా అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్తుంది. ఒక డైరెక్టర్ విజన్ ఎలా ఉంటుందో చెప్పడానికి నాలుగు సంవత్సరాల క్రితం వచ్చిన రంగస్థలం సినిమా ఒక ఉదాహరణ.
ఈ సినిమా ఎన్నో కారణాల వల్ల ఒక ప్రత్యేకమైన సినిమాగా నిలిచిపోయింది. మనం అంతకుముందు రామ్ చరణ్ ని ఇలా ఎప్పుడూ చూడలేదు. అది కూడా హీరో పాత్రకి లోపం ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. కానీ సుకుమార్ ఈ సినిమాతో ఆ సాహసం చేశారు. అలాగే సినిమాలోని సెట్టింగ్స్ కూడా సినిమాకి ప్రాణం పోశాయి. ఈ సినిమాలో చిన్న చిన్న సీన్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్త తీసుకున్నారు. ఒక సీన్ లో చాలా విషయాల గురించి వివరంగా చెప్పడానికి ప్రయత్నించారు. అంటే సుకుమార్ అంతా జాగ్రత్తగా రాసుకున్నారు. అందుకు ఉదాహరణ ఈ సీన్.
ఇందులో గమనిస్తే 15 సెకండ్లలో రామ్ చరణ్ పోషించిన చిట్టిబాబు పాత్రలో మూడు వేరియేషన్స్ కనిపిస్తాయి. ఇందులో చిట్టిబాబు రామలక్ష్మిని ఏడిపించే వాళ్ళని కొడతాడు. అంటే రామలక్ష్మిని చిట్టిబాబు ఇష్ట పడుతున్నాడు అని ఇక్కడ మనకు చూపించారు. అలాగే అప్పటివరకూ చిట్టిబాబుని మనం చూసి అమాయకుడు అనుకుంటాం. కానీ తన కుటుంబం కోసం ఏమి లెక్క చేయడు అని ఈ సీన్ లో చూపించారు. అంతే కాకుండా ఇదే సీన్ జగపతి బాబు వస్తూ ఉంటారు అప్పుడు అప్పటివరకు గొడవ పడుతున్న చిట్టిబాబు సడన్ గా మళ్ళీ కొంచెం భయపడతాడు.
ఈ సీన్ లో చిట్టిబాబుని హనుమంతుడుతో పోల్చారు. సాధారణంగా కనిపించిన కూడా చిట్టిబాబు చాలా బలవంతుడు అని ఇలా అవసరమైనప్పుడు తన బలం బయటికి వస్తుంది అని ఈ సీన్ ద్వారా చూపించేలాగా రాసుకున్నారు సుకుమార్. అందుకే ఈ మూడు వేరియేషన్స్ మనకి అర్థం అవ్వాలని ఒక్కొక్క వేరియేషన్ కి ఒక్క బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా మార్చారు. అలా కొన్ని సెకండ్ల సీన్ లో కూడా ఇంకా అర్థం ఉండేలాగా సుకుమార్ జాగ్రత్తలు తీసుకున్నారు అని ఇది చూస్తే మనకి అర్థం అవుతోంది. ఇదే కాకుండా ఈ సినిమాలో ఇంకా చాలా సీన్స్ లో కూడా ఇలాగే చిన్న చిన్న విషయాల్లో మనకి చాలా విషయాలని చెప్పారు.
watch video :
End of Article