Ads
- చిత్రం : భళా తందనాన
- నటీనటులు : శ్రీ విష్ణు, కేథరిన్ థ్రెసా, గరుడ రామ్, పోసాని కృష్ణ మురళి, సత్య, అయ్యప్ప శర్మ
- నిర్మాత : రజనీ కొర్రపాటి
- దర్శకత్వం : చైతన్య దంతులూరి
- సంగీతం: మణిశర్మ
- విడుదల : మే 6,2022
Video Advertisement
స్టోరీ :
శశిరేఖ (కేథరిన్ ట్రెసా) ఒక ప్రముఖ మీడియా సంస్థలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా పని చేస్తూ ఉంటుంది. అనాధ శరణాలయం మీద రైడ్ చేస్తున్న సమయంలో ఆ న్యూస్ కవర్ చేయడానికి చంద్రశేఖర్(శ్రీ విష్ణు) వెళ్తాడు. అక్కడ వీరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. అది కాస్త ప్రేమగా మారుతుంది. ఆనంద్ బాలి (గరుడ రామ్) అనే ఒక హవాలా మాఫియా ఉంటాడు. అయితే ఆనంద్ బాలి హ్యాండోవర్ లో ఉన్న రెండు వేల కోట్ల రూపాయలు దొంగతనం జరిగిందన్న విషయం శశిరేఖ కి తెలుస్తుంది. శశిరేఖ దానిని తమ మీడియా సంస్థలో ప్రచురిస్తుంది. చందు మిస్ అవడం..రెండు వేల కోట్ల రూపాయలకు చందుకి సంబంధం ఏమిటి..?, ఈ డబ్బు ఏమైంది..? చందు, శశిరేఖ ఒక్కటయ్యారా ఇదే కథ.
రివ్యూ :
చాలా రోజుల తర్వాత మళ్లీ శ్రీ విష్ణు హీరోగా నటించిన సినిమా ఒకటి థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా మొదట్లో ఒక కిడ్నాప్ జరగటం ఆ తర్వాత దానిని కనెక్ట్ చేస్తూ కథ ని డైరెక్టర్ తీసుకు రావడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా మొదటి భాగం అంతా కూడా పాత్రలని పరిచయం చేసారు. మొదట హీరో అమాయకుడు అని పరిచయం చేసారు కానీ హీరో అమాయకుడు కాదనే విషయాన్ని ప్రీ ఇంటర్వెల్ లో చూపించి మూవీ మీద ఇంట్రెస్ట్ ని కల్పించారు.
ఇక రెండో భాగంలో అయితే రెండు వేల కోట్ల రూపాయల చుట్టూనే కథ తిరుగుతూ ఉంటుంది. అలానే డబ్బు ఏమైంది అనేది సస్పెన్స్ లో ఉంటుంది. మొత్తం మీద కధ ఆసక్తిగా వుంది. ప్రేక్షకులని సినిమా ఆకట్టుకునేలానే వుంది. కథనంలో చిన్న చిన్న పొరపాట్లు, టేకింగ్ లో పొరపాట్లు వున్నాయి.
మణిశర్మ సంగీతం సినిమాకి ప్లస్ అయ్యింది. విలన్ గా నటించిన గరుడ రామ్ బాగా ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రాఫర్ సురేష్ కూడా బాగా పని చేసారు. ఫస్ట్ ఆఫ్ ఎడిటింగ్ కాస్త దెబ్బతింది. ఈసారి కూడా శ్రీ విష్ణు మంచి మార్కులే కొట్టేసాడు. కామెడీ టైమింగ్ తో యాక్షన్ తో ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. చిన్న చిన్న లాజిక్స్ పక్కనపెట్టి చూస్తే చక్కగా ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే చిత్రం ఇది.
ప్లస్ పాయింట్స్:
- కధ
- నటీనటుల పెర్ఫార్మెన్స్
- సంగీతం
- సస్పెన్స్
- సినిమాటోగ్రఫీ
మైనస్ పాయింట్స్ :
- కధనం
- టేకింగ్ లో పొరపాట్లు
- చిన్న చిన్న లాజిక్స్
రేటింగ్ :
2 .25/5
ట్యాగ్ లైన్ :
కామెడీ టైమింగ్ తో యాక్షన్ తో ప్రేక్షకులకి మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. చిన్న చిన్న లాజిక్స్ పక్కనపెట్టి చూస్తే చక్కగా ఫ్యామిలీతో కలిసి సరదాగా చూసే చిత్రం ఇది.
End of Article