Ads
- చిత్రం : చిన్ని
- నటీనటులు : కీర్తి సురేష్, శ్రీ రాఘవ, కన్నా రవి.
- నిర్మాత : సిద్ధార్థ్ రావిపాటి
- దర్శకత్వం : అరుణ్ మాథేశ్వరన్
- సంగీతం : సామ్ సీ.ఎస్
- విడుదల తేదీ : మే 6, 2022 (అమెజాన్ ప్రైమ్)
Video Advertisement
స్టోరీ :
చిన్ని (కీర్తీ సురేష్) పోలీస్. తన భర్త మారప్ప రైస్ మిల్లులో పని చేస్తూ ఉంటాడు. అయితే ఓరోజు అగ్ర వర్ణానికి చెందిన వ్యక్తి అతన్ని అవమానిస్తాడు. తన భార్య గురించి తప్పుగా మాట్లాడతాడు. దీనితో మారప్ప అతని ముఖంపై ఉమ్మేస్తాడు. అది సహించలేని అగ్ర వర్ణ పెద్దలు భార్య పోలీస్ అవడం వల్లే ఇలా ప్రవర్తిస్తున్నాడని చిన్ని పై అత్యాచారానికి ఒడిగడతారు.
అలానే మారప్ప మరియు అతని కుమార్తె ఇంట్లో ఉండగా ఇంటికి నిప్పు పెట్టి తగలబెడతారు. న్యాయం జరగదేమో అన్నట్టే ఉంటుంది పరిస్థితి. చిన్నికి సవతి సోదరుడు రంగయ్య (సెల్వ రాఘవన్) న్యాయం కోసం ఏం చేశారు..? తన ప్రతీకారం ఎలా తీర్చుకున్నారు..? అనేది కధ.
రివ్యూ :
ఈ సినిమా థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. సినిమా ప్రకటించి చాలా రోజులు అయ్యింది. కానీ కోవిడ్ కారణంగా, అలాగే మరెన్నో కారణాలవల్ల సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. దాంతో అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ కోసం ఒక విషయం దాచారు దర్శకుడు. కీర్తీ సురేష్ నటన చాలా బాగుంది. కీర్తీ సురేష్ క్యారెక్టర్‌లో హీరోయిజం ఉండేలా తీశారు. సినిమా మొత్తం క్లియర్ గా ఉంటుంది. అంతా బాగా అర్ధం అయ్యేలా తీశారు.
సెల్వ రాఘవన్ నటన కూడా బాగుంది. అరుణ్ మాథేశ్వరన్ నటులను బాగా ఎంపిక చేసారు. సంగీతం మరియు సినిమాటోగ్రాఫి కూడా బాగుంది. యామిని యజ్ఞమూర్తి బ్లాక్ అండ్ వైట్ థీమ్‌లో కొన్ని సన్నివేశాలను బాగా తీశారు. ఈ సినిమాలో వయలెన్స్ కొంచెం ఎక్కువే. అది కొందరికి నచ్చకపోవచ్చు.
ప్లస్ పాయింట్స్ :
- కీర్తి సురేష్, సెల్వ రాఘవన్ నటన
- సినిమాటోగ్రఫీ
- కధ
- మ్యూజిక్
మైనస్ పాయింట్స్ :
- ఎక్కువ వయలెన్స్
రేటింగ్ :
3/5
ట్యాగ్ లైన్ :
కీర్తి సురేష్ ఇలాంటి పాత్ర ఇప్పటివరకు చేయలేదు. సినిమాలో కొంచెం హింసాత్మక సన్నివేశాలు ఎక్కువగా ఉన్నా కూడా కీర్తి సురేష్ ని కొత్తగా చూడాలి అనుకునే వారికి, అలాగే ఒక డిఫరెంట్ సినిమా చూద్దాం అనుకునేవారికి ఈ సినిమా నచ్చుతుంది.
End of Article