“రావు రమేష్” యాక్టింగ్ ని చూసే ఆ నిర్ణయం తీసుకున్నాము: ప్రశాంత్ నీల్

“రావు రమేష్” యాక్టింగ్ ని చూసే ఆ నిర్ణయం తీసుకున్నాము: ప్రశాంత్ నీల్

by Megha Varna

Ads

ఎన్నో రోజులు వెయిట్ చేసిన తర్వాత కేజీఎఫ్ చాప్టర్-2 విడుదల అయ్యింది. కేజీఎఫ్ మొదటి భాగం ఎవరూ ఊహించనంత పెద్ద హిట్ అయ్యింది. మొదటి భాగం మొత్తంలో కూడా రాకీ భాయ్ ఎలా ఎదిగాడు అనేది చూపించారు. రెండవ భాగంలో మాత్రం రాకీ భాయ్ ఎదిగిన తర్వాత తాను ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అనేది చూపించారు?

Video Advertisement

మొదటి భాగంలాగానే ఈ సినిమా కూడా పవర్ ఫుల్ గా ఉంటుంది. అసలు రాకీ భాయ్ ని జనాలు అందరూ అంత గుర్తు పెట్టుకునే అంతగా ఏం చేసాడు అనేది ఈ సినిమాలో చూపించారు.

కెజిఎఫ్ సినిమాతో చాల మంది నటీ నటులకు ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ లో గుర్తింపు కూడా రావడం జరిగింది. రావు రమేష్ కూడా కేజీఎఫ్ చాప్టర్-2 లో నటించారు. రావు రమేష్ విలనిజం తో పాటు కామెడీ సెంటిమెంట్ పాత్రలను కూడా ఎంతో అద్భుతంగా చేస్తారు. సీమ సింహం సినిమాతో టాలీవుడ్ లోకి రావు రమేష్ పరిచయమయ్యారు.

ఆ తర్వాత కొత్త బంగారులోకం, గమ్యం మొదలైన సినిమాల్లో నటించారు. మొన్న ఈ మధ్య విడుదలైన కేజీఎఫ్ చాప్టర్-2 లో కూడా రావు రమేష్ అద్భుతంగా నటించి మెప్పించారు. అయితే ఈ సినిమాలో రావు రమేష్ పాత్రని దర్శకుడు ఎక్కువ సమయానికి పెంచడం జరిగింది.

దర్శకుడు నీల్ రావు రమేష్ కి కేవలం చిన్న పాత్ర మాత్రమే ఇందులో అనుకున్నామని.. కానీ ఆయన ట్యాలెంట్ ని చూడగానే ఆయన పాత్రని కొంచెం ఎక్కువ సేపు ఇవ్వాలని అనుకున్నట్లు చెప్పారు. నిజానికి రావు రమేష్ కాల్ షీట్ ఒక నాలుగు రోజులు మాత్రమే కానీ ఆయన ఆ నటనని చూసి, టాలెంట్ ని చూసి 14 రోజుల పాటు కాల్ షీట్ ని పెంచడం జరిగింది.


End of Article

You may also like