Ads
సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రల తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే.
Video Advertisement
ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు ఆయనని నిత్యం ప్రేక్షకుల గుండెల్లోనే ఉంచుతాయి. ఆయన గురించి ప్రతి విషయాన్నీ ఇప్పటికీ ఆసక్తిగా తెలుసుకునే అభిమానులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు.
ఎన్టీఆర్ నట వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ బాగానే పేరు తెచ్చుకున్నారు. వీరి కుమారులు, ఎన్టీఆర్ కు మనవాళ్ళు చైతన్య కృష్ణ, తారక రత్న, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మూడవ తరం నటులుగా నట వారసత్వాన్ని అందుకున్నారు. అందరికి తెలియని విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ కు మరో సోదరుడు ఉన్నాడని.. ఆయన కూడా కెరీర్ మొదటిలో కొన్ని సినిమాల్లో నటించారన్న సంగతి. ఈ సంగతి చాలా మందికి తెలియదు.
సీనియర్ ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమరావు కూడా చిత్ర పరిశ్రమలో నిర్మాతగా పని చేసారు. ఆయనకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. కళ్యాణ్ చక్రవర్తి, హరీన్ చక్రవర్తి వీరిద్దరూ త్రివిక్రమ రావు కుమారులు. కళ్యాణ్ చక్రవర్తి సినీ ఇండస్ట్రీలో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన సోదరుడు హరీన్ చక్రవర్తి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని అన్న బాటలోనే సినిమాల్లోకి వచ్చారు. అయితే.. అనుకోని రోడ్డు ప్రమాదం కారణంగా ఆయన మరణించారు. మనుషుల్లో దేవుడు’ సినిమాతో బాల నటుడిగా పరిచయం అయిన హరీన్ 1986లో ‘మామాకోడళ్ల సవాల్’ సినిమాతో ఆక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత ‘పెళ్లికొడుకులొస్తున్నా’ సినిమాలో యముడిగా నటించి మెప్పించారు. కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలోనే ప్రాణాలను కోల్పోయారు.
End of Article