Home Filmy Adda ఏంటి “విష్ణు” గారూ… ఇలా మాట మార్చేశారు..? వైరల్ అవుతున్న వీడియో..!

ఏంటి “విష్ణు” గారూ… ఇలా మాట మార్చేశారు..? వైరల్ అవుతున్న వీడియో..!

by Anudeep

సరైన హిట్స్ లేక గత కొంత కాలంగా మంచు విష్ణు సినిమాలపై ఫోకస్ చేయడం లేదు. ఈ మధ్యకాలంలో మా అధ్యక్షుడిగా అయిన తర్వాత కూడా సినిమాపై అంతా ఫోకస్ చేయడం లేదు. ఆడోరకం ఈడోరకం సినిమా తర్వాత ఆ రెంజ్ లో హిట్ ని అందుకోలేకపోయాడు. మధ్య మధ్యలో చేసిన సినిమాలు కూడా ఆశించిన స్థాయిలో హిట్ ని అందుకోలేక పోయాయి.

త్వరలో కోన వెంకట్ కథ, స్క్రీన్ ప్లే లో గాలి నాగేశ్వరరావు సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు సన్నీ లియోన్ మరియు హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటిస్తున్నారు.

manchu vishnu

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మంచు విష్ణు తనదైన శైలిలో సందడి చేస్తున్నారు. మంచు విష్ణు చేసిన ఒక వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అసలు విషయానికి వస్తే ఒక ఇంటర్వ్యూలో ఇద్దరు హీరోయిన్లు విడివిడిగా ఉండగా  మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని మంచు విష్ణు అడగగా పాయల్ రాజ్ పుత్ పక్కన ఉండగా, పాయల్ తన ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకొచ్చాడు.

manchu vishnu

కొంత సమయం తర్వాత సన్నీ లియోన్ ఎంట్రీ  ఇవ్వగా సన్నీ  మాత్రమే ఉండగా సన్నీ నా ఫేవరెట్ హీరోయిన్ అని చెప్పుకొచ్చాడు. మరి కొంత సమయం తర్వాత సన్నీ మరియు  పాయల్ ఇద్దరితో కలిసి ఉండగా ఈ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడిగితే, అమాంతం ప్లేట్ ఫిరాయించి నట్లు ఆలియా భట్ నా ఫేవరెట్  హీరోయిన్ అని ఇద్దరికీ షాక్ ఇచ్చాడు. ఇద్దరు హీరోయిన్స్ మంచు విష్ణు ఇచ్చిన సమాధానానికి అవాక్కయ్యి నోరు వెల్లబెట్టారు.

watch video :

You may also like