అంతు చిక్కని మిస్టరీ.. ఆ ఊళ్ళో అసలు అబ్బాయిలే పుట్టరు.. అందరికి ఆడపిల్లలే.. అసలు కథ ఏంటంటే?

అంతు చిక్కని మిస్టరీ.. ఆ ఊళ్ళో అసలు అబ్బాయిలే పుట్టరు.. అందరికి ఆడపిల్లలే.. అసలు కథ ఏంటంటే?

by Anudeep

Ads

ఈ భూమిపై ఎన్నో వింతలు విశేషాలు, ఎవరికీ అంతు చిక్కని రహస్యాలు దాగున్నాయి. కొన్ని మిస్టరీలను ఛేదించడం సైన్స్ వల్ల కూడా కాదు. ప్రపంచంలో జరుగుతున్న మిస్టరీలను సైన్స్ ఇప్పటికీ ఛేదించలేకపోయింది. తాజాగా ఈ జాబితాలో మరో మిస్టరీ వచ్చి చేరింది.

Video Advertisement

అదేంటంటే.. ఆ ఊరిలో గర్భవతులు అయిన అమ్మాయిలకు కేవలం అమ్మాయిలే పుడుతున్నారు. ఒక్కరికి కూడా అబ్బాయి సంతానంగా కలగడం లేదు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఆ ఊళ్ళో 12 సంవత్సరాలుగా మగ పిల్లలు పుట్టకపోవడానికి కారణం ఏంటో ఇప్పటికీ ఎవరూ కనుక్కోలేకపోతున్నారు.

baby girl 1

ఇటీవల ఆ గ్రామ మేయర్ ఓ పోటీ పెట్టారు. ఒక్కరైనా మగ సంతానాన్ని కంటే ఆ కుటుంబంలోని వారికి రివార్డు అంద చేస్తామని ప్రకటించారు. కానీ.. ఆ ఊరిలో ఒక్కరు కూడా ఆ రివార్డ్ ను అందుకోలేకపోయారు. కారణం ఏంటంటే.. ఒక్కరికి కూడా మగ సంతానం కలుగలేదు. ఈ మిస్టరీ విలేజ్ పోలాండ్ దేశంలో ఉంది. ఈ ఊరి పేరు మిజెస్కే ఓడ్ర్జెన్స్కీ. గత పన్నెండు సంవత్సరాలుగా ఈ ఊరిలో మగ సంతానం కలగడం లేదు.

baby girl 2

దీనికి కారణం ఏంటో ఏ శాస్త్రవేత్తా కూడా కనిపెట్టలేకపోతున్నారు. 2019 వ సంవత్సరంలో ఆ ఊరి మేయర్ ఎవరికైనా మగ సంతానం కలిగితే రివార్డ్ ఇప్పిస్తానని తెలిపారు. కానీ, ఒక్కరికి కూడా మగ సంతానం కలుగకపోవడంతో ఒక్కరు కూడా ఈ రివార్డ్ ను తీసుకోలేకపోయారు. గతంలో చాలా వార్తా పత్రికలలో ఈ విషయం గురించి వచ్చినా చాలా మంది శాస్త్రవేత్తలు కొట్టిపడేసారు. కానీ 12 ఏళ్లుగా అక్కడ మగపిల్లలు ఎందుకు పుట్టడంలేదు అన్న ప్రశ్న మాత్రం మిస్టరీగా మిగిలిపోయింది. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం త్వరలోనే ఈ మిస్టరీని ఛేదిస్తామని చెబుతున్నారు.


End of Article

You may also like