చూసుకోవాలి కదయ్యా ఎడిటరూ..? విజయ్ దేవరకొండ “ఖుషి” సినిమా పోస్టర్ లో ఇది గమనించారా..?

చూసుకోవాలి కదయ్యా ఎడిటరూ..? విజయ్ దేవరకొండ “ఖుషి” సినిమా పోస్టర్ లో ఇది గమనించారా..?

by Anudeep

Ads

సమంత, విజయ్ దేవరకొండ కలిసి ఓ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా యూనిట్ టైటిల్ ను రివీల్ చేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాకు  “ఖుషి” అనే టైటిల్ ను ఖరారు చేసారు.

Video Advertisement

ప్రస్తుతం ఈ సినిమా టైటిల్ తాలూకు పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరో వైపు పవన్ కళ్యాణ్ “ఖుషి” సినిమా టైటిల్ నే ఈ సినిమాకు కూడా పెట్టడంతో సోషల్ మీడియాలో మీమర్స్ కు ఫుల్ గా పని పడింది.

khushi poster

ఈ పోస్టర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతుండడంతో సోషల్ మీడియాలో ఈ పోస్టర్ గురించే ఎక్కువగా చర్చ నడుస్తోంది. కొందరేమో ఈ పోస్టర్ పై పింక్ డామినేషన్ ఎక్కువగా ఉందని కామెంట్స్ చేస్తుంటే.. మరికొందరేమో విజయ్ దేవరకొండ డ్రెస్సింగ్ స్టయిల్ వింతగా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరేమో ఈ పోస్టర్ లో ఉన్న తప్పుని చూపిస్తూ ఏకంగా ట్రోలింగ్ చేస్తున్నారు.

ఈ పోస్టర్ లో మీరు జాగ్రత్తగా గమనించి చూస్తే విజయ దేవరకొండ సిగరెట్ తాగుతున్నట్లు కనిపిస్తాడు. కానీ.. పోస్టర్ ను కొంతవరకు జూమ్ చేసి చూడండి. అప్పుడు ఆ సిగరెట్ నోటికి దగ్గరగా మాత్రమే ఉన్నట్లు ఉంటుంది. నోటిలో ఉన్నట్లు ఉండదు. దానిని గమనించి చూస్తే సిగరెట్ పెట్టుకుని ఉండగా ఈ స్టిల్ తీయలేదని.. సిగరెట్ ను ఫోటో తీసేసాక ఎడిటింగ్ చేసారని ఎవరికైనా అర్ధం అయిపోతుంది. ఈ అమీర్ పేట్ ఎడిటింగ్ చేయడం ఏంటో..? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియా మీమర్స్ కూడా దొరికిందే ఛాన్స్ అన్నట్లు ట్రోలింగ్ షురూ చేసారు.


End of Article

You may also like