Ads
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ ల లేటెస్ట్ సూపర్ హిట్ సినిమా సర్కారు వారి పాట. గీత గోవిందం సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన పరుశురాం ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. రిలీజ్ రోజు కొంత డివైడ్ టాక్ వచ్చిన పైసా వసూల్ అంటూ దూసుకుపోతుంది. లోన్లు, ఈఎంఐలు, బ్యాంకింగ్ రంగం బ్యాక్డ్రాప్ లో తీసిన ఈ సినిమా సామాన్యజనానికి కనెక్ట్ అయ్యింది. మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన జీవన విధానాన్ని ఈ సినిమాలో కళ్లకుకట్టినట్లు చూపించారు. మూడు రోజుల్లోనే 150 కోట్ల రూపాయలు వసూళ్లు రాబట్టి హిస్టరీ క్రియేట్ చేసిందని తెలిపింది చిత్ర యూనిట్.
Video Advertisement
ఇక ఈ సినిమా లో అన్ని కామెడీ సీన్స్ హైలైట్. కామెడీ లో మహేష్ బాబు టైమింగ్ సూపర్. మహేష్ తో పాటు వెన్నెల కిశోరె, ప్రభాస్ శ్రీను, సుబ్బరాజుల క్యారెక్టర్లు పర్ఫెక్ట్ కామెడీ టైమింగ్ తో చేసిన సీన్స్ అన్ని ఈ సినిమాకే హైలైట్. మహేష్ బాబు, సుబ్బరాజుల మధ్య వచ్చే కామెడీ సీన్లలో సుబ్బరాజు ఫోన్ రింగ్ టోన్ గా భీమ్లానాయక్ టోన్ వినిపిస్తుంది.
సుబ్బరాజు కు మహేష్ ఫోన్ చేసినప్పుడల్లా భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ రింగ్ టోన్‌లా వినిపిస్తుంది. ఒక స్టార్ హీరో సినిమాలో ఇంకో స్టార్ హీరో సినిమాకు సంబంధించిన ప్రస్తావన రావడం చాలా అరుదు. ఒకవేళ ఒకే ఫామిలీ హీరోలు అయితేనే అది సాధ్యం. కానీ సర్కారు వారి పాటలో భీమ్లా నాయక్ రింగ్ టోన్‌ను అలా వాడారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారడమే కాకుండా.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అయితే అసలు మహేష్ సర్కారు వారి పాట లో పవన్ భీమ్లా నాయక్ రింగ్ టోన్ ఎందుకు వాడినట్లో తెలియడం లేదు. ఈ రెండు సినిమాలకు థమన్ మ్యూజిక్ అందించాడు. సర్కారు వారి పాట ప్రొడ్యూసర్లు మైత్రి మూవీ మేకర్స్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవన్ తో నెక్స్ట్ “భవదీయుడు భగత్ సింగ్” అనే సినిమా తీస్తున్నారు. దానికీ కూడా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో ఆ మూవీకి పబ్లిసిటీ అయినట్లు ఉంటుందని చెప్పి సర్కారు వారి పాట సినిమాలో భీమ్లా నాయక్ రింగ్ టోన్‌ను వాడి ఉంటారని తెలుస్తోంది. అయితే దీని వెనుక ఉన్న కారణాలు తెలియదు కానీ.. మహేష్ లాంటి అగ్రహీరో సినిమాలో ఇంకో అగ్ర హీరో రిఫరెన్స్‌ను వాడడంపై చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
End of Article