Home Viral గాలి నన్ను గర్భవతిని చేసింది..గంటలోనే ప్రసవం.! అసలు ట్విస్ట్ ఏంటంటే.?

గాలి నన్ను గర్భవతిని చేసింది..గంటలోనే ప్రసవం.! అసలు ట్విస్ట్ ఏంటంటే.?

by Anudeep

ఓ మహిళ తాను గర్భవతిని అని తెలుసుకున్న గంటకే ప్రసవించేసింది. అయితే.. ఇది ఎలా సాధ్యమైందో ఆమె కు అర్ధం కాలేదు. ప్రసవానికి ముందు ఆమె ప్రార్ధన చేసుకుంటుండగా ఆమె యోని భాగం లోంచి గాలి వెళ్లినట్లు ఆమె అనుభూతి చెందిందట. అయితే, క్రమం గా ఆమె కు కడుపులో నొప్పులు రావడం మొదలైంది. మరో గంటకు ఆమె ప్రసవించింది. ఆమెకు పండంటి ఆడబిడ్డ పుట్టింది. అయితే వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. తల్లి బిడ్డా ఇద్దరు క్షేమంగానే ఉన్నారు. కానీ.. అసలు ఆమెకు గర్భం ఎలా వచ్చిందన్నది మాత్రం అర్ధం కాలేదు.

indoneshia women 1

ఆమె చెప్పిన మాటలు విని పోలీసులు కూడా విస్తుపోయారు. ఇండోనేషియా కు చెందిన శితి జైనా వయసు పాతిక సంవత్సరాలు. ఆమె మతాల ప్రకారం, మధ్యాహ్న సమయం లో ప్రార్ధన పూర్తి చేసుకుని.. తాను పడుకుని ఉన్నానని.. అంతలోనే తన లోపలికి ఎదో గాలి వెళ్లినట్లు అనిపించిందని ఆమె చెప్తోంది. ఆ తరువాత నొప్పులు మొదలై ప్రసవం అయినట్లు పేర్కొంది. ఆమె మీడియా తో మాట్లాడిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

indoneshia women 2

ఇది విన్న తరువాత పోలీసులు శితి ఇంటికి వెళ్లి పరిశీలించారు. దర్యాప్తు చేయడం ప్రారంభించారు. ఇంతకీ తేలిన విషయం ఏమిటంటే.. ఆమెకు తాను 37 వారాలు గర్భవతి అన్న సంగతి తెలియదు. గర్భ నిరోధక మాత్రలను ఆమె వినియోగిస్తుంది. ఆమెకు పీరియడ్స్ కూడా వస్తుండడం తో.. తాను గర్భవతి అని ఆమె భావించలేదు. నెలలు నిండగానే బిడ్డ క్షేమం గానే బయటకు వచ్చింది. కానీ.. ప్రసవానికి గంట ముందు మాత్రమే తాను గర్భవతి అయ్యానన్న విషయాన్ని ఆమె గ్రహించింది.” అని పోలీసులు తెలిపారు.

You may also like