ఎన్టీఆర్ కెరీర్ కష్టాల గురించి చెప్తూ ఓ అభిమాని పంపిన లెటర్…చదివాక ఫ్యాన్ అవ్వకుండా ఉండలేరు!

ఎన్టీఆర్ కెరీర్ కష్టాల గురించి చెప్తూ ఓ అభిమాని పంపిన లెటర్…చదివాక ఫ్యాన్ అవ్వకుండా ఉండలేరు!

by Sainath Gopi

Ads

అన్న గారు స్వర్గస్తులైన తర్వాత ఆ ఇంటి వారసత్వాన్ని నిలబెట్టడానికి ఎవరొస్తారా అని అభిమానులంతా ఎదురు చూసారు. అలాంటి నటుడు తెలుగు సినీ పరిశ్రమకు మళ్లీ దొరకరేమో అని కొందరు దిగులుచెందారు. కానీ 6 ఏళ్ల తర్వాత పెద్దాయన లాగే రూపురేఖలు, ఆయన లాగే నటన ప్రావీణ్యం ఉన్న ఆయన మనవడు వచ్చాడు. నందమూరి తారక రామా రావు అనే పేరుతో సినీ పరిశ్రమలో తెరంగేట్రం చేసి ఆ పేరుని నిలబెట్టాడు. సాధారణంగా స్టార్ కుటుంభం నుండి వచ్చిన వారికి కెరీర్ చాల సులభంగా ఉంటుంది అనుకుంటారు అందరు. కానీ ఆ వారసత్వాన్ని నిలబెట్టడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది. ఆ ఇంటి పేరు ఆయనకు అవకాశాన్ని మాత్రమే తెచ్చిపెట్టింది. కానీ ఆ పేరుని నిలబెట్టింది మాత్రం తారక్ లోని కృషి పట్టుదలే.

Video Advertisement

చిన్నప్పటి నుండే నటన అంటే ఇష్టం. చైల్డ్ ఆర్టిస్ట్ గా “బాలరామాయణం” లో నటించే అందరిని మెప్పించారు. కానీ అప్పటికి తారక్ నందమూరి వారసుడు అని చాలా మందికి తెలీదు. హీరో గా చేసిన తొలిచిత్రం “నిన్ను చూడాలని”. ఆ సినిమా అంతగా ఆడలేదు. అయినా నిరాశ చెందలేదు తారక్.

నీకు ఓటమా? నీకున్న బలంతోనే నువ్వు అనుకున్నది సాదిస్తావు. నటన నీలోని బలం. నాట్యం నీకున్న వరం, నువ్వు కాలు కదిపితే ఆంధ్ర దేశం విజిలేసి ఎగురుతుంది

అని తాత గారు అన్నట్టు అనిపించింది అనుకుంట. రెండో సినిమాకే నందమూరి అభిమానులు కాలర్ ఎగిరేసుకునేలా చేసాడు. ఇక “సింహాద్రి” తో 20 ఏళ్ల వయసులోనే రికార్డులు అన్ని బద్దలు కొట్టాడు.

ఎవరైనా ఒక హీరో బాగా డాన్స్ చేయగలరు, లేకుంటే బాగా డైలాగ్ చెప్పగలరు, లేకుంటే ఎమోషన్ బాగా పండించగలరు, లేకుంటే ఆక్షన్ బాగా చేయగలరు. కానీ ఆ టాలెంట్ అంతా ఒకరితోనే ఉంటె ఎలా ఉంటుంది అంటే “తారక్” లాగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి ఏమి లేదు.ఆ మాటను ఎందరో సినీ ప్రముఖులు కూడా మాటల సందర్భంలో అన్నారు. ఆక్టర్ మాత్రమే కాదు…తారక్ మంచి సింగర్ కూడా.

సింహాద్రి తో రికార్డ్స్ బద్దలు కొట్టిన తర్వాత కెరీర్ అంత సింపుల్ గా సాగలేదు. ఒకవైపు అభిమానుల అంచనాలు పెరుగుతున్నాయి. మరోవైపు లావుగా ఉన్నాడు అంటూ కొందరు కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. అవే రొటీన్ సినిమాలు చేస్తూ ఉన్నారు అంటూ అపహేళన చేసేవారు ఎక్కువయ్యారు. కానీ నందమూరి అభిమానుల ఆశలను నిలబెట్టడానికి తనను తాను మార్చుకున్నాడు. దాదాపు 20 కిలోల బరువు తగ్గి “యమదొంగ”తో మనముందుకు వచ్చాడు. యముడిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. అభిమానుల అంచనాలను నిలబెట్టాడు.

ఆ తర్వాత అదుర్స్, బృందావనం తో వరస హిట్లు అందుకున్నాడు. కానీ అంతలోనే మళ్లీ కెరీర్ డౌన్ అయ్యింది. వరస ప్లాప్ లు ఎదురయ్యాయి. “బాద్ షా” ఒక్కటే ఆ మధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్. కెరీర్ ఇలా అయ్యింది ఏంటి అని నందమూరి అభిమానులు బాధ పడ్డారు. కానీ తారక్ మాత్రం గాయపడిన సింహంలా “టెంపర్” తో తన నటవిశ్వరూపాన్ని చూపించి మరోసారి నందమూరి అభిమానులు కాలర్ ఎగిరేసుకునేలా చేసారు. ఇక అప్పటినుండి కెరీర్ లో వెనక్కి తిరిగి చూడలేదు. టెంపర్ తర్వాత నుండి తారక్ ఎంచుకున్న స్క్రిప్ట్స్ సూపర్ డూపర్ హిట్ లు గా నిలిచాయి. అరవింద సమేత సమయంలో తన జీవితంలో అత్యంత బాధాకరమైన సంఘటన చోటు చేసుకుంది. తన తండ్రిని దూరమయ్యాడు. ఆ కష్టాన్ని దిగమింగి తండ్రిగా తన బాధ్యతను పెంచుకుని కుటుంబాన్ని చూసుకుంటూ. సరైన స్క్రిప్ట్స్ ఎంచుకుంటూ సినిమా కెరీర్ లో దూసుకెళ్తున్నారు.

ఎంత పెద్ద డైలాగ్ ని అయినా సింగల్ టేక్ లో చెప్పగలడు తారక్. అందుకే డైరెక్టర్స్ అందరికి తారక్ తో సినిమా చేయడం అంటే ఇష్టం. “జై లవ కుశ” లో ఒకేసారి స్క్రీన్ మీద మూడు పత్రాలు కనిపించినా, అందరు ఒకే డ్రెస్ వేసినా? జై ఎవరో లవ ఎవరో కుశ ఎవరో? ఇట్టే చెప్పగలం. దానికి కారణం ఎన్టీఆర్ ఎక్స్ప్రెషన్స్. అభిమానులకి తారక్ అంటే ఎంత ఇష్టమో. తారక్ కి తన అభిమానులంటే కూడా అంతే ఇష్టము. కర్నూల్ లో వరదల సమయంలో 20 లక్షలు డొనేట్ చేసారు. తర్వాత హుధుద్ సమయంలో మరో 20 లక్షలు డొనేట్ చేసారు. “సినిమాలు చేస్తా…ప్రతి నందమూరి అభిమాని కలర్ ఎగిరేసుకునేలా చేస్తా” అని చెప్పిన మాటలను నిలబెట్టుకున్నాడు.

ఇటీవలే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR లో ఎన్టీఆర్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుంట. ఒకే ఫ్రేమ్ లో కోపం, బాధ, కరుణ, ప్రేమ అన్ని చూపించడం తారక్ కే సొంతం అనుకుంట.

#Happy Birthday Nandamuri Taraka Rama Rao Junior

ఇట్లు,
ఓ తారక్ అభిమాని
Sainath Gopi (facebook.com/saigopi777)

 


End of Article

You may also like