Ads
ఈ మే 30న పుట్టినరోజుతో తన 39వ సంవత్సరంలో అడుగు పెట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన పుట్టినరోజు సందర్భంగా అభినందనలు తెలిపిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.
Video Advertisement
తాను ఇంటిలో లేకపోవడం వల్ల అభిమానులు కలవలేకపోతున్నాను అని ఎన్టీఆర్ తెలిపారు. అయితే ఎన్టీఆర్ ఇంట్లో లేకపోతే ఎక్కడ ఉండవచ్చు అనే అభిమానుల్లో చర్చ మొదలైంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఐటీసీ కోహినూర్ అపార్ట్మెంట్ లో ఉన్నట్లుగా సమాచారం వెల్లడవుతుంది. దీనికి కారణం ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇలాంటి సమయంలో అభిమానులు కలిసి ఫోటోలు దిగడం ద్వారా తన నెక్స్ట్ సినిమా లుక్ బయటపడుతుందనే పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఐటిసి కోహినూర్ లోని సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ ను కలుసుకుని గురువారం రాత్రి ఆయన పుట్టిన రోజు వేడుకలు జరిగినట్లుగా సమాచారం. ఇప్పటికే ఎన్టీఆర్ తన రెండు సినిమాల ప్రాజెక్టులో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాల అప్ డేట్స్ తో ఎన్టీఆర్ తర్వాత ప్రాజెక్టుల అంచనాలు మరింత పెరుగుతాయని చెప్పవచ్చు. 2023 చివరినాటికి ఎన్టీఆర్ రెండు ప్రాజెక్టులను పూర్తి చేయనున్నాడు. వచ్చే ఈ రెండు సినిమాలతో ఎన్టీఆర్ స్థాయి మరింత పెరుగుతోందని చెప్పవచ్చు.
RRR ఈ సినిమాతో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు ఎన్టీఆర్. వరుసగా రెండు సినిమాలతో ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోవడంతో అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలతో మరింత విజయాన్ని సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
End of Article