Ads
RRR చిత్రం తర్వాత రామ్ చరణ్ క్రేజ్ బాగా పెరిగిందని చెప్పవచ్చు. రామ్ చరణ్ పోషించిన రామరాజు పాత్రకు నార్త్ లో మంచి గుర్తింపు పొందాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా RC15 తెరకెక్కనుంది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.
Video Advertisement
ఇప్పటికే లీకైన కొన్ని చిత్ర సన్నివేశాలు, రామ్ చరణ్ గెటప్, కథ గురించి ప్రచారాలు అభిమానులలో ఆసక్తి పెంచుతోంది. ఈ చిత్రం ఒక సెన్సేషనల్ గా ఉండబోతుంది. సినిమాకి సంబంధించి ఇప్పటికే చాలా వార్తలు బయటకు వస్తున్నాయి. రామ్ చరణ్ ఈచిత్రంలో సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా నటిస్తున్నారు. ఈ గెటప్ ఇప్పటికే సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక RC15 చిత్రంలో రామ్ చరణ్ గెటప్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయట. ఇక ఈ చిత్రంపై ఒక విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ చిత్రంలో రామ్ చరణ్ ప్రభుత్వ విధానాలు, పద్ధతులకు విసిగిపోయిన ఒక షార్ట్ టెంపర్ వ్యక్తిగా కనిపిస్తాడట. విసిగిపోయిన ఈ విధానాలతో ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నారు.
ఇది శంకర్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం కాబట్టి అభిమానులు కొత్తదనాన్ని ఆశిస్తున్నారు. ఎలాంటి మలుపులు ఉంటాయో అంటూ ఊహించుకుంటున్నారు. ఇంటర్వెల్ తర్వాత రామ్ చరణ్ ముఖ్యమంత్రిగా మారితే సినిమా అదుర్స్ అంటున్నారు. ఇన్ని గెటప్స్ లో రామ్ చరణ్ కనిపిస్తే ఇక అభిమానులకు పండగే పండగ అంటూ నెటిజన్లు అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దశలో ఉంది. శంకర్ సినిమాకి మొదటి సారిగా తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన పాటలు, వాటికి సంబంధించిన చర్చలు కూడా తమన్ మొదలుపెట్టారు. ఈ సినిమా పాన్ ఇండియన్ సినిమాగా విడుదల అవుతుంది. రామ్ చరణ్ నటించిన ఆర్ఆర్ఆర్ తర్వాత పాన్ ఇండియన్ విడుదల అయ్యే సినిమా ఇదే.
End of Article