Ads
తెలుగు ప్రేక్షకులకు అచ్యుత్ ను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన సినిమాల ద్వారా, సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు అచ్యుత్. ఆయన చదువుకుంటున్న రోజుల్లోనే సినిమాలపై ఆసక్తితో మధు ఫిలిం ఇన్స్టిట్యూట్ లో చేరి నటనపై శిక్షణ తీసుకున్నారు.
Video Advertisement
తొలిసారిగా ఇంద్ర ధనుస్సు అనే దూరదర్శన్ సీరియల్ లో అచ్యుత్ కనిపించారు. ఆ తరువాత సినిమాల్లో కూడా రాణించారు. ప్రేమ ఎంత మధురం అనే సినిమా ద్వారా సినిమారంగం లో అచ్యుత్ తన కెరీర్ ను ప్రారంభించారు.
ఎదురు లేని మనిషి, తమ్ముడు, అల్లరి రాముడు, డాడీ వంటి సినిమాలతో అచ్యుత్ కు మరింత గుర్తింపు లభించింది. ఎన్నో ఫిలిం అవార్డులను సైతం ఆయన సొంతం చేసుకున్నారు. 2002 లో గుండెపోటుతో అచ్యుత్ మృతి చెందారు. ఆయన ఎలా చనిపోయారు అన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన మరణం గురించి ఎఫ్ 2 ఫేమ్ “అంతేగా అంతేగా” డైలాగ్ తో ఫేమస్ అయిన నటుడు ప్రదీప్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.
అచ్యుత్ మరణంపై అప్పట్లో చాలా విషయాలు ప్రచారం జరిగాయని.. ఎక్కువగా డ్రింక్ చేయడం వల్లే చనిపోయారంటూ వార్తలొచ్చాయని చెప్పుకొచ్చారు. కానీ, ఆరోగ్య రీత్యా స్ట్రైన్ అయిన అచ్యుత్ స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లని మానేశారని చెప్పుకొచ్చారు. కానీ, స్వీట్లు, కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకునేవారని.. వీటి వలన కొలెస్టరాల్ లెవెల్స్ లో తేడా వచ్చి.. అవి గుండెపై ప్రభావం చూపాయని.. గుండెపోటు రావడంతో ఆయన చిన్న వయసులోనే మరణించారని చెప్పుకొచ్చారు. అచ్యుత్ మరణాన్ని ఇప్పటికీ జీర్ణించుకోలేనని.. మా పిల్లలు అచ్యుత్ ను బాబాయ్ అని పిలుస్తారని.. అచ్యుత్ ను తల్చుకుంటుంటే ఇప్పటికీ బాధ కలుగుతుందని చెప్పుకొచ్చారు.
End of Article