ఈ “కొత్త బంగారు లోకం” నటుడు “RRR” లో డబుల్ రోల్ చేసారని తెలుసా? ఏ ఏ సీన్స్ లో అంటే..?

ఈ “కొత్త బంగారు లోకం” నటుడు “RRR” లో డబుల్ రోల్ చేసారని తెలుసా? ఏ ఏ సీన్స్ లో అంటే..?

by Anudeep

Ads

రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఓ రేంజ్ లో రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి కావడం, ఇద్దరు స్టార్ హీరోలు ఉండడం, బాలీవుడ్ నటులు కూడా ఈ సినిమాలో భాగం కావడంతో ఈ సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఉండేవి. అయితే.. సినిమా విడుదల అయ్యాక కూడా అదే రేంజ్ లో రికార్డు లను దుమ్ముదులిపింది ఈ సినిమా.

Video Advertisement

ఇటీవలే జీ 5 ఓటిటి యాప్ లో కూడా విడుదల అయ్యి మంచి ఫలితాన్నే రాబట్టింది. అయితే.. ఈ సినిమా విడుదల అయ్యాక.. ఈ సినిమాలో నటించిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు సైతం మంచి పేరు లభించింది.

chinni krishna

మల్లి పాత్రలో నటించిన అమ్మాయి కూడా అలానే ఫేమస్ అయింది. ఇది ఇలా ఉంటె.. ఈ సినిమాలో ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఏకంగా రెండు పాత్రలను పోషించేసాడు. అతను ఎవరో కాదు.. కొత్త బంగారు లోకం సినిమాలో హాస్టల్ వార్డెన్ గా కనిపించి మెప్పించిన నటుడు. అతనెవరో కాదు. అతని పేరు చిన్ని కృష్ణ. కొత్త బంగారు లోకం సినిమా లో వార్డెన్ గా కనిపించి బాగా పాపులర్ అయ్యారు. ఆ తరువాత ఆయన ఫిలిం డైరెక్టర్ అయిపోయారు.

chinni kirshna 1

తాజాగా.. ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఆయన రెండు చోట్ల వేర్వేరు పాత్రలలో కనిపించారు. ఈ విషయాన్నీ చాలా మంది నోటీస్ చేయలేదు. కానీ సినిమాను మరో సారి చూసి అబ్జర్వ్ చేస్తే ఈ విషయం తెలుస్తుంది. ఒక క్యారెక్టర్ లో రామ్ చరణ్ ని కలిసిన వ్యక్తిగా నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్ని కృష్ణ కనిపిస్తారు. ఆ తరువాత ఎన్టీఆర్ ఊరు వాళ్ళ లాగ, కామన్ పీపుల్ లో ఒకడిగా కూడా చిన్ని కృష్ణ కనిపిస్తారు.

chinni kirshna 2

మొదటి రోల్ లో కనిపించినప్పుడు క్లీన్ షేవ్ తో కనిపించిన చిన్ని కృష్ణ, రెండవ రోల్ లో కనిపించినప్పుడు మాత్రం ఫుల్ గడ్డంతో, పూర్తిగా మరో వ్యక్తిలా కనిపిస్తారు. చాలా జాగ్రత్తగా గమనించి చూస్తే ఈ రెండు పాత్రలు నటించిన వ్యక్తి ఒకరే అని తెలుస్తుంది. దీనిపై సోషల్ మీడియాలో కూడా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.


End of Article

You may also like