ఎప్పుడూ ట్రైన్ లోనే కనిపించే ఈ నటుడు గుర్తున్నారా..? ఈయన ఎవరో తెలుసా?

ఎప్పుడూ ట్రైన్ లోనే కనిపించే ఈ నటుడు గుర్తున్నారా..? ఈయన ఎవరో తెలుసా?

by Harika

Ads

ఈ ఫోటోలో కనిపిస్తున్న నటుడు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితులు. రవితేజ హీరోగా నటించిన వెంకీ సినిమాలో బెస్ట్ కామెడీ సీన్స్ గా పేరు తెచ్చుకున్న ట్రైన్ సీన్స్ లో ఈయన పెర్ఫామెన్స్ కి అందరు ఫిదా అయ్యారు. ఆ సినిమాలో ఈయన కామెడీ టైమింగ్ కూడా బాగుంటుంది.

Video Advertisement

అదొక్క సినిమానే కాదు.. సునీల్ హీరోగా వచ్చిన “మర్యాద రామన్న” లో కూడా ఈయన కనిపిస్తారు. అక్కడ కూడా ఈయన ట్రైన్ సీన్స్ లోనే కనిపిస్తారు. అయితే ఈయన కనిపించిన సినిమాలు తక్కువే అయినా ఎక్కువగా ట్రైన్ సీన్స్ లోనే కనిపించడం వల్ల కూడా సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.

kanchi 1

ఇది ఇలా ఉంటె.. ఈయన పేరు ఎస్.ఎస్ కంచి. ఈయన బాగా పాపులర్ అయిన అమృతం సీరియల్ కు డైరెక్టర్. అంతే కాదు ఈయన ప్రముఖ రచయిత కూడా. మగధీర, ఈగ సినిమాలకు రైటర్ గా కూడా పని చేసారు. మర్యాద రామన్న సినిమాకు కూడా ఈయన రచయితగా సహకారం అందించారు. ఈయన దర్శకేంద్రుడు రాజమౌళికి రిలేటివ్స్ అవుతారు. రాజమౌళికి ఎస్ .ఎస్ కంచి సోదరుడి వరుస అవుతారు.

kanchi 2

ఎక్కువగా రాజమౌళి మూవీస్ లోనే కనిపిస్తూ ఉంటారు. అమృతం మూవీ లో కూడా కౌంటర్ దగ్గర కూర్చున్న సీన్స్ లో కూడా ఎస్. ఎస్ కంచి కనిపిస్తారు. వెంకీ సినిమాలో క్లైమాక్స్ లో స్టేడియం సీన్ లో కనిపిస్తారు. అలాగే సై సినిమాలో కూడా స్టేడియం లో కనిపిస్తారు. కానీ కొద్దిసేపు మాత్రమే కనిపిస్తారు. ఎక్కువ సేపు ట్రైన్ సీన్స్ లో మాత్రమే కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజెన్న్ మీమ్స్ వేసుకుని నవ్వుకుంటున్నారు.

https://www.instagram.com/p/Cd7b5vdpSgs/


End of Article

You may also like