Ads
సీనియర్ ఎన్టీఆర్ కి ఎంత పేరు ఉందో మనకి తెలుసు. నటనతో ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు ఎన్టీఆర్. సినిమా పరిశ్రమలో ఎదురులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. పౌరాణిక పాత్రల తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు ఎన్టీఆర్. నిజానికి అన్న గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన నటించిన సినిమాలు ఆయనని నిత్యం ప్రేక్షకుల గుండెల్లోనే ఉంచుతాయి. ఆయన గురించి ప్రతి విషయాన్నీ ఇప్పటికీ ఆసక్తిగా తెలుసుకునే అభిమానులు ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు.
Video Advertisement
ఎన్టీఆర్ నట వారసులుగా బాలకృష్ణ, హరికృష్ణ బాగానే పేరు తెచ్చుకున్నారు. వీరి కుమారులు, ఎన్టీఆర్ కు మనవళ్ళు చైతన్య కృష్ణ, తారక రత్న, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు మూడవ తరం నటులుగా నట వారసత్వాన్ని అందుకున్నారు.
2002 లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమా తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తారక రత్న తాను కూడా మంచి నటుడు అవ్వాలని, స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవాలని కలలు కన్నారు. అమరావతి సినిమాలో ఆయన చేసిన నెగిటివ్ షేడ్స్ ఉండే పాత్ర కి ఎంతో పేరు వచ్చింది. ఆ సినిమా కి నంది అవార్డు కూడా అందుకున్నారు. హీరోగా కొన్ని సినిమాలు చేశారు. మనమంతా లో ఒక ముఖ్య పాత్ర కూడా చేసారు. రాజా చెయ్యివేస్తే సినిమాలో నెగిటివ్ రోల్ చేశారు. తారకరత్న చివరిగా 2017 లో వచ్చిన ఖయ్యుమ్ భాయ్ సినిమా లో కనిపించారు.
ఆ తరువాత తారక రత్న ఇక సినిమాలలో కనిపించలేదు. మంచి నటుడు అయినా.. నటించాలన్న కోరిక కలిగి ఉన్నా సినిమాలకు దూరం అవ్వడంతో తారక రత్న విషయంలో అభిమానులు చాలా నిరుత్సాహ పడ్డారు. సరైన అవకాశాలు రాలేదేమోనని భావించారు. తాను సినిమాలకు దూరంగా ఉండడానికి అసలు కారణం ఏంటో తారక రత్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వివరించారు. తారక రత్న సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చే టైం కే.. నందమూరి వారసుడిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ “ఆది” సినిమాతో ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఆ టైం లో తారకరత్న ఎన్టీఆర్ కు పోటీ గా వచ్చారు అంటూ ప్రచారం జరిగింది.
ఆ తరువాత పలు సినిమాలలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేసినప్పటికీ తారకరత్న ఎన్టీఆర్ కు కాంపిటీషన్ గా వచ్చారు అన్న ప్రచారం మాత్రం ఆగలేదు. ఇది తారకరత్న కు ఇష్టంలేదు. తనకంటే ముందే ఇండస్ట్రీ లోకి వచ్చినా.. ఎన్టీఆర్ పట్ల మంచి స్నేహ భావమే ఉండేది. ఈ కాంపిటీషన్ అనేది నచ్చని తారకరత్న సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. నందమూరి వంశాన్ని ఎవరు ముందుకు తీసుకెళ్లినా అది మా అందరికి సంతోషమేనని.. మా మధ్య కాంపిటీషన్ లాంటివి ఉండవని చెప్పుకొచ్చారు. ఆయన చెప్పుకొచ్చిన విషయాలను మీరు ఈ కింద వీడియోలో చూడొచ్చు.
Watch Video:
End of Article