Ads
మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. సినిమాల పై ఇష్టంతో చిరంజీవి మొదట ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ… కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.
Video Advertisement
ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని చిరంజీవి సొంతం చేసుకున్నారు. నాటి హీరోలకి కూడా చిరంజీవి ఆదర్శం. నటనతో, డాన్స్ తో అందర్నీ ఫిదా చేసేస్తారు చిరంజీవి.
అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా తాను హీరో అవ్వకముందు ఓ హీరో కి అభిమానిగా ఉండేవారు. అంతే కాదు ఆ రోజుల్లోనే ఆయన ఆ స్టార్ హీరో ఫ్యాన్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా కూడా ఉన్నారు. ఆ స్టార్ హీరో ఎవరో కాదు. సూపర్ స్టార్ కృష్ణ. ఈస్ట్ మన్ కలర్ లో తెలుగు ప్రజలకు నూతన టెక్నాలజీని పరిచయం చేసిన తొలి హీరో సూపర్ స్టార్ కృష్ణ.
ఆయనకు మెగాస్టార్ చిరంజీవి మొదటి అభిమాని. సూపర్ స్టార్ కృష్ణను చిరంజీవి మొదటినుంచి అభిమానించేవారు. ఒకరకంగా చెప్పాలంటే చిరంజీవి సినిమాల్లోకి రావడానికి కూడా సూపర్ స్టార్ కృష్ణ స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఎన్నో వైవిధ్యమైన కథలతో వచ్చి ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొన్న సూపర్ స్టార్ కృష్ణకు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. ఆయనకు ఓ అభిమాన సంఘాన్ని కూడా ఏర్పాటు చేసారు. ఈ సంఘానికి చిరంజీవే అధ్యక్షుడిగా ఉన్నారు.
End of Article