Home Filmy Adda కమల్ హాసన్ సినిమాల్లో కనిపించే ఈ నటుడు ఎవరో తెలుసా? కమల్ హాసన్ తో ఉన్న రిలేషన్ ఏంటంటే?

కమల్ హాసన్ సినిమాల్లో కనిపించే ఈ నటుడు ఎవరో తెలుసా? కమల్ హాసన్ తో ఉన్న రిలేషన్ ఏంటంటే?

by Anudeep

ఈ ఫోటో లో ఉన్న నటుడిని గుర్తుపట్టారా..? ఈయన చాలా తమిళ సినిమాలలో కనిపిస్తారు. ” విక్రమ్ ” సినిమాలో కూడా ఈయన ఏజెంట్ ఉల్లియప్పన్ గా కనిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. తమిళ సినిమాలను చూసే తెలుగు ప్రేక్షకులందరికీ ఈయన సుపరిచితుడే. అయితే.. మరో విషయం గమనించారా..? ఈయన ఎక్కువగా కమల్ హాసన్ సినిమాలలో కనిపిస్తూ ఉంటారు. ఇంతకీ ఈయన ఎవరో తెలుసుకుందాం.

ఈయన పేరు సంతాన భారతి. తమిళ నాట పేరున్న నటుడు మరియు డైరెక్టర్ కూడా. ఈయన కొన్ని టెలివిజన్ సీరియల్స్ కు కూడా దర్శకత్వం వహించారు. హాస్య మరియు విలన్ రోల్స్ ను పోషించి విలక్షణ నటుడిగా పేరు పొందారు.

సివి శ్రీధర్ లాంటి సూపర్బ్ డైరెక్టర్ దగ్గర పనిచేసినా సంతాన భారతికి కెరీర్ మొదట్లో అవకాశాలు రాలేదు. స్నేహితుడు పి.వాసుతో కలిసి ఆఫర్ల కోసం చూస్తున్న టైం లో 1981 సంవత్సరంలో పన్నీర్ పుష్పంగల్ అనే సినిమాకు అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత స్నేహితుడి పేరు కలుపుకుని భారతి వాసు పేరిట అనేక సినిమాలను రూపొందించిన సంగతి అందరికి తెలిసిందే. ఆ తరువాత ఆయన తీసిన గుణ, చిన్న మాపిళ్లై, మహానంది వంటి చిత్రాలు మంచి ప్రశంసలు లభించాయి. ఈ క్రమంలోనే ఆయనకు కమల్ హాసన్, క్రేజీ మోహన్ లతో కూడా సాన్నిహిత్యం కుదిరింది.

vikram and sanathan bharathi

ఆయన సినిమాల్లో ఎక్కువగా కమల్ హాసన్, క్రేజి మోహన్ లు కనిపిస్తూ ఉంటారు. సినిమాలకు కలిసి పని చేస్తూ.. వారి స్నేహ బంధాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. ముంబై ఎక్స్ ప్రెస్, అమావాస్య చంద్రుడు, దశావతారం, బ్రహ్మ చారి వంటి సినిమాలలో కూడా కనిపిస్తారు. కమల్ నటించిన మహానంది సినిమాను సంతాన భారతిని డైరెక్ట్ చేసారు. ఇక ముంబై ఎక్స్ప్రెస్ సినిమాలో కమెడియన్ గా కనిపించి మెప్పించారు. తాజాగా.. కమల్ హాసన్ “విక్రమ్” సినిమాలో ఏజెంట్ ఉల్లియప్పన్ గా కనిపించి అందరిని తనవైపు తిప్పుకున్నారు. ఆయన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోవడంతో.. ఆయన గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

You may also like