Ads
సివిల్స్ సర్వీస్ పరీక్షలలో అత్యధిక మార్కులు సాధించడం అనేది ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. అంత ఈజీగా పాస్ అవ్వలేరు. పుస్తక పరిజ్ఞానంతో పాటు కాస్త లోక జ్ఞానం కూడా ఉంటేనే ఇటువంటి పరీక్షలలో పాస్ అవ్వగలుగుతాము. అంతేకాదు.. నిరంతర శ్రమ పట్టుదలతో ఈ పరీక్షలకు ప్రిపేర్ అయితేనే విజయం సాధించడం సాధ్యం అవుతుంది.
Video Advertisement
అయితే.. లక్షల మంది పరీక్షకు హాజరు అవుతుంటారు. కానీ, వీరిలో కొన్ని వందల మంది మాత్రమే ఉత్తీర్ణులు అవుతుంటారు. 2021 సివిల్ సర్వీసెస్ పరీక్షలలో మొత్తం 5 లక్షల మంది విద్యార్థులు హాజరు అయ్యారు. కానీ, వీరిలో 685 మంది మాత్రమే పాసయ్యారు.
కాగా.. ఇటీవల విడుదల అయిన ఫలితాలలో ఝార్ఖండ్ లో రామ్‌గఢ్ జిల్లాకు చెందిన 24 ఏళ్ల దివ్య పాండే కు 323 ర్యాంక్ వచ్చిందని తెలిసింది. పరీక్షలకు ప్రిపేర్ అయ్యి.. రాసిన మొదటి సారే ఆమెకు ర్యాంక్ వచ్చిందని సంబరపడ్డారు. ఆమె కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధువులు అందరూ ఆమెని అభినందించారు. అయితే.. ఆ ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. తాను పాస్ అవలేదని.. తన పేరుని 323 ర్యాంక్ వద్ద పొరపాటున చూపించారని తెలియడానికి ఎక్కువ సమయం పట్టలేదు.
దివ్య పాండే రిజల్ట్స్ చూసుకోవడం ఆలస్యం అయ్యింది. నెట్ సరిగా రాకపోవడంతో ఆమె పరీక్షా ఫలితాలను చూసుకోలేకపోయింది. అయితే.. ఆమె దగ్గరి స్నేహితురాలు రిజల్ట్స్ ను చూసి దివ్యకు 323 ర్యాంక్ వచ్చిందని చెప్పడంతో ఆమె సంతోషపడింది. పొరపాటు జరిగి ఉంటుందని ఆమె ఊహించలేదు. దీనితో ఆమె చూసుకోకపోయినా తన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు చెప్పేసింది. దివ్య తండ్రి సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (సీసీఎల్ఏ)లో క్రేన్ ఆపరేటర్ గా పని చేసేవారు. ప్రస్తుతం ఆయన రిటైర్ అయ్యి ఉన్నారు.
కూతురు విజయం సాధించిందని ఆయన కూడా ఎంతో సంతోషించారు. క్రేన్ ఆపరేటర్ కుమార్తెకు సివిల్స్ ర్యాంక్ వచ్చింది అంటూ మీడియా కథనాలు కూడా వెలువడ్డాయి. కానీ, ఈ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు. కొన్ని రోజుల తరువాత వెబ్సైటు ఓపెన్ చేసి ఆమె మార్కులు చెక్ చేసుకోబోగా.. అసలు విషయం తెలిసింది. పి.దివ్య అనే దక్షిణాదికి చెందిన అమ్మాయికి 323 ర్యాంక్ వచ్చినట్లు తెలిసింది. దీనితో జరిగిన పొరపాటును తెలుసుకున్న దివ్య పాండే కుటుంబం ఈ విషయాన్నీ వెంటనే మీడియా కి తెలిపి, సివిల్ యాజమాన్యానికి కూడా తెలిపి క్షమాపణలు కోరింది. తమకేమీ దురుద్దేశ్యం లేదని.. పొరపాటు వలనే ఇలా జరిగిందని చెప్పుకొచ్చింది. దీనిపై స్పందించిన రామ్ ఘడ్ అధికారులు ఇది పొరపాటుగానే చూస్తున్నామని.. దివ్యపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని తెలిపారు.
End of Article



