Home Filmy Adda ఆ తప్పు వల్లే చిరంజీవి తమిళనాట స్టార్ హీరో అవ్వలేదు.. అసలు విషయం చెప్పిన కమల్ హాసన్..!

ఆ తప్పు వల్లే చిరంజీవి తమిళనాట స్టార్ హీరో అవ్వలేదు.. అసలు విషయం చెప్పిన కమల్ హాసన్..!

by Anudeep

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టాలీవుడ్ లో ప్రముఖ స్టార్ హీరోలలో చిరంజీవి కూడా ఒకరు. సినిమాల పై ఇష్టంతో చిరంజీవి మొదట ఎన్నో కష్టాలు పడి ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ… కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని చిరంజీవి సొంతం చేసుకున్నారు. నాటి హీరోలకి కూడా చిరంజీవి ఆదర్శం. నటనతో, డాన్స్ తో అందర్నీ ఫిదా చేసేస్తారు చిరంజీవి.

kamalhasan chiranjeevi

అయితే.. మెగాస్టార్ చిరంజీవి ఎంత మంచి నటుడు అయినా.. ఆయన స్టార్ డమ్, నటనా శైలి కేవలం తెలుగు తెరకే పరిమితం అయ్యింది. చాలా మంది మెగాస్టార్ చిరంజీవికి తమిళనాట అవకాశాలు రాలేదని ఫీల్ అవుతూ ఉంటారు. తమిళనాట ఇండస్ట్రీ వల్లే అవకాశాలు రాలేదని అనుకుంటూ ఉంటారు. కానీ అసలు విషయం ఏంటో కమల్ హాసన్ వివరించారు.

చిరంజీవి కెరీర్ మంచి ఫామ్ లో ఉన్న సమయంలో ఆయన కేవలం తెలుగు తెరకే పరిమితం అయ్యారన్నారు. తెలుగు నాట ఎక్కువ సినిమాలు కమిట్ అవ్వడంతో.. తమిళ నాట సినిమాలు నటించడానికి ఆయన సమయం కుదరలేదని.. చిరంజీవి తెలుగు సినిమాలకే ఎక్కువ కమిట్ అవ్వడం వల్లే తమిళనాట ఆయనకు స్టార్ డమ్ రాలేదని చెప్పుకొచ్చారు.

You may also like