కొత్త నాణేలను ప్రధాని మోడీ ఎందుకు విడుదల చేశారు..? వీటి ప్రత్యేకత ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

కొత్త నాణేలను ప్రధాని మోడీ ఎందుకు విడుదల చేశారు..? వీటి ప్రత్యేకత ఏంటో తెలిస్తే నోరెళ్లబెడతారు..!

by Anudeep

Ads

ప్రస్తుతం ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకలు జరుగుతున్న సంగతి తెలిసిందే.. అయితే.. ఈ వేడుకలలో భాగంగా ఐకానిక్ వీక్ సెలెబ్రేషన్స్ కూడా మొదలు పెట్టారు. ఈ ఉత్సవాల సందర్భంగానే ప్రధాని మోడీ కొత్త నాణేలను కూడా విడుదల చేసారు. కేంద్ర ఆర్ధిక శాఖ అద్వ్యర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

Video Advertisement

75 సంవత్సరాల స్వాతంత్ర వేడుకలను పునస్కరించుకునే ఈ వేడుకలను ప్రారంభించారు. ఈ ఆజాదీకి అమృత్ మహోత్సవ్ వేడుకల లోగోను కొత్తగా విడుదల చేసిన రూ. 1 , రూ.5 . రూ.10 కాయిన్స్ పై వేయించారు.

modi

ఈ నాణేల ప్రత్యేకత ఏంటంటే.. వీటిని అంధులు కూడా సులభంగా గుర్తించగలుగుతారు. ఇరవై రూపాయల విలువ కల నాణేలను కూడా ముద్రించారు. ఇవి కేవలం స్మారక నాణేలు మాత్రమే కాదని.. త్వరలోనే వీటిని వాడుకలోకి తీసుకొస్తామని ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

modi 1

ఈ నాణేలు ఇతర నాణేల లాగ గుండ్రంగా కాకుండా బహుభుజి ఆకారంలో ఉంటుంది. ఈ నాణెం మధ్యలో అశోక స్థంభం సింహాలు కనిపిస్తాయి. ఈ నాణేలను తయారు చేయడానికి నికెల్ వెండి, ఇత్తడిని ఉపయోగించారు. భారత దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఈ నాణేలు విడుదల చేయబడుతున్నాయి. దృష్టిలోపాలు ఉన్న వారు సైతం వీటిని సులభంగా గుర్తించగలుగుతారు. వీటిపై బ్రెయిలీ లిపి ముద్రించబడి ఉంది. అందుకే వీటిని గుర్తించడం అంధులకు సులభం అవుతుంది.


End of Article

You may also like