Home Filmy Adda Samantha : “సమంత” లేటెస్ట్ ఫోటోల వెనకాల ఇంత స్టోరీ ఉందా..?

Samantha : “సమంత” లేటెస్ట్ ఫోటోల వెనకాల ఇంత స్టోరీ ఉందా..?

by Anudeep

Ads

పాన్ ఇండియా చిత్రాలతో దేశవ్యాప్తంగా మన సౌత్ ఇండియన్ స్టార్స్ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. బాహుబలి, పుష్ప, RRR చిత్రాలు ఓ రేంజ్ లో దేశవ్యాప్తంగా బాక్సాఫీస్ ని షేక్ చేసేసాయి.

Video Advertisement

మన టాలీవుడ్ సినిమాలు నార్త్ లో కూడా తన హవాని కొనసాగిస్తూ ఉన్నాయి. పుష్ప సినిమాలో ఊ అంటావా మామ అంటూ సమంత చేసిన ఐటమ్ సాంగ్ కి మంచి ఫాలోయింగ్ తో ఫ్యాన్స్ సంపాదించుకుంది. ఈ పాట దేశవ్యాప్తంగా అన్ని భాషలో యువతను ఉర్రూతలూగించింది.

Samantha new look

అయితే ఇప్పుడు సమంత ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ గా కొన్ని అట్రాక్టివ్ ఇమేజెస్ ని పోస్ట్ చేసింది. చైతూ తో విడాకుల తర్వాత సమంత రోజు రోజుకు తన గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది.

ఈ ఇమేజెస్ లో సమంత లుక్ అదిరిపోయింది అని చెప్పవచ్చు. రెడ్ కలర్ డ్రెస్ లో ఎంతో గార్జియస్ గా కనిపిస్తుంది సమంత. ఇంతకీ సమంత ఇంత అందంగా ఎందుకు రెడీ అయిందని మీరు అనుకుంటున్నారా.. అసలు విషయం ఏంటంటే.. సమంత ఒక షో కోసం ఈవిధంగా తయారయ్యింది. ఇంతకీ ఆ షో ఏంటి అనుకుంటున్నారా. ఆ షోనే కాఫీ విత్ కరణ్. ఈ ప్రోగ్రాంలో పాల్గొనడం కోసం సమంత ఇలా అదిరిపోయే లుక్ లో కనిపించింది.

మన టాలీవుడ్ చిత్రాల పాన్ ఇండియా స్థాయిలో సక్సెస్ అయిన తర్వాత మన సౌత్ స్టార్స్ ఎంతోమంది కాఫీ విత్ కరణ్ షోకి హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రష్మిక, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ షోలో పాల్గొని ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నారు. ఇప్పుడు ఆ లిస్టులో సమంత కూడా చేరిపోయింది. త్వరలో హాట్ స్టార్ లో కాఫీ విత్ కరణ్ ఈ ప్రోగ్రామ్ తో ప్రేక్షకులకు కనువిందు చేయనుంది.


End of Article

You may also like