Ads
ఇంటి పనిమనిషిని ఎంచుకోవడానికి ఓ మహిళ వింత వింత కండిషన్స్ ను పెట్టింది. తాను కోరుకున్న విషయాలన్నింటిని ఓ లిస్ట్ లా ప్రిపేర్ చేసింది. ఈ లిస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. Sgfollowsall అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి ఓ వీడియో షేర్ చేయబడింది.
Video Advertisement
ఈ వీడియోలో సదరు మహిళ రాసిన కండిషన్స్ అన్ని ఉన్నాయి. ఒక మహిళ వైట్‌బోర్డ్‌లో తన 12 కోరికలను రాసుకొచ్చింది. తన ఇంటికి పని చేయడానికి వచ్చే హెల్పర్స్ ఈ పన్నెండు కండిషన్స్ ని తప్పకుండ ఒప్పుకోవాలని పేర్కొంది.
ఇంతకీ ఆమె పెట్టిన కండిషన్స్ ఏంటో ఇప్పుడు ఓ లుక్ వేయండి!
#1, పని చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు.
#2. తెలియని వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు. వారి కోసం తలుపులు తీయవద్దు.
#3. ఇంట్లోని వారి అనుమతి లేకుండా ఇంటి నుంచి బయటకు వెళ్ళడానికి వీలు లేదు.
#4. ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
#5. ఆహారాన్ని సిద్ధం చేసేటప్పుడు, నిద్రించేటప్పుడు విధిగా స్నానం చేసి ఉండాలి.
#6. పిల్లలు నిద్రపోయిన తరువాత.. ఒక గంట వరకు మాత్రమే మొబైల్ ఫోన్ ను వినియోగించాలి.
#7. మీకోసం కేటాయించిన గది తలుపులను లాక్ చేయడానికి వీలు లేదు.
# 8.ఇంట్లోని వాటర్ ను, కరెంటు ను వేస్ట్ చేయకూడదు.
# 9. ప్రతి రోజూ విధిగా రాత్రి 9.30కి నిద్రపోయి ఉదయం ఏడింటికి లేవాలి.
#10. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలి.
#11. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో బిగించిన కెమెరా ముందే ఉండి పని చేసుకోవాలి.
#12. అనుమతి లేకుండా ఇంటి ఏసీ ఆన్ చేయకూడదు.
దీనితో ఈ కండిషన్స్ అన్నిటిని చూసిన నెటిజన్లు ఇది కూడా ఒకరకమైన ఇబ్బందికర పరిస్థితి కిందకే వస్తుందని తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఒక మనిషి ఎప్పుడు పడుకోవాలో.. ఎప్పుడు మేల్కొవాలో కూడా ఎలా నిర్ణయిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఏ పని మనిషి అయినా సూత్రాలను పాటించగలరా? అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఈ లిస్ట్ మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
https://www.instagram.com/p/CeAQSwTBIxe/?utm_source=ig_embed&ig_rid=7021a6aa-a7d4-4493-ab16-7ca1bef12dcc
End of Article