ఈ మేఘన ఎవరో తెలుసా? అసలు చదువులో ఆమె రేంజ్ ఏంటంటే?

ఈ మేఘన ఎవరో తెలుసా? అసలు చదువులో ఆమె రేంజ్ ఏంటంటే?

by Anudeep

Ads

ఈ ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. చిన్నారి మేఘన. గతం లో ఈమె పై ఓసారి ట్రోలింగ్ జరిగింది. ఇంగ్లీష్ బాగా మాట్లాడడమే అందుకు కారణం. అయితే.. టెన్త్ క్లాస్ ఫలితాలు వచ్చిన తరువాత ఈ ట్రోలింగ్ మరింత ఎక్కువ అయ్యింది. ఆ మధ్య ఓ మీటింగ్ లో మేఘన జగనన్నతో ప్యూర్ ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఆమె పాఠశాల తరపున తన బాధ్యతగానే ఆమె మాట్లాడింది.

Video Advertisement

కానీ.. అప్పటి నుంచి ఆమె ట్రోలింగ్ కి గురి అవుతూనే ఉంది. మేఘన తూర్పు గోదావరి జిల్లా, తొండంగి మండలం, బెండపూడి జెడ్పి హై స్కూల్ లో చదువుకుంది. ఈ స్కూల్ తరపున సీఎం జగన్ ను కలిసిన మేఘన, అక్కడ జగనన్నతో ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడింది.

అయితే.. ఆరోజు అంత బాగా ఇంగ్లీష్ మాట్లాడింది కదా.. పదవ తరగతిలో మేఘనకు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చాయో పాపం.. అంటూ నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక మీమ్ పేజీలలో వచ్చే ట్రోలింగ్స్ కు కొదవ లేదు. ఇంగ్లీష్ ఒక్కటే చదువుకుని వెళ్ళిందేమో.. అంటూ మరికొందరు ట్రోల్ చేసారు. కానీ, నిజానికి ఆ అమ్మాయి మంచి స్టూడెంట్ అట. ఆమెకు మార్కులు కూడా బాగా వచ్చాయట.

meghana 1

మొత్తంగా ఆమె 478 మార్కులను సొంతం చేసుకుందట. ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడిన ఆమెకు ఇంగ్లీష్ లో 91 మార్కులు వచ్చాయట. అలా అని మిగతా సబ్జెక్ట్స్ లలో తక్కువ మార్కులు కాదు.. అన్నిటిలోను ఆమె డెబ్భై శాతానికి పైనే మార్కులు తెచ్చుకుంది. తెలుగులో 84 , హిందీలో 75 , మ్యాథ్స్ లో 79 , సోషల్ లో 71 , సైన్స్ లో 78 మార్కులను సొంతం చేసుకుంది. కేవలం మార్కులను బట్టే విద్యార్థుల ప్రగతిని నిర్ణయించలేము. కానీ.. మేఘన విషయంలో మాత్రం ఆమె మంచిగా మార్క్స్ తెచ్చుకున్న ట్రోలింగ్ కి గురి అవుతోంది. ఇటీవల ప్రతి చిన్న విషయమూ ఎంతగా వైరల్ అయ్యి.. ట్రోల్ అవుతుందో చెప్పడానికి మేఘన పై ట్రోలింగ్ ఓ ఉదాహరణ అని చెప్పచ్చు.


End of Article

You may also like