Ads
కెరియర్ పరంగా ముందుకు దూసుకుపోవడానికి నేటి యువత చాలా లేటుగా మ్యారేజ్ చేసుకుంటూ ఉంటారు. ఇలా ఆలస్యంగా వివాహం చేసుకున్న వారిలో మన సినీ ఇండస్ట్రీలో తారలు చాలామంది ఉన్నారు.
Video Advertisement
తమ సినీ కెరీర్ సక్సెస్ సాధించే వరకు వివాహం చేసుకోకుండా కాలం వెళ్లబుచ్చారు. మూడు పదుల వయసు దాటినా తమ వయసు పెరుగుతుందనే విషయాన్ని మర్చిపోతూ ఉంటారు. ఇలా ఆలస్యంగా వివాహం చేసుకున్న వారిలో మన హీరోస్ తో పాటు చాలా మంది హీరోయిన్స్ కూడా ఉన్నారు. మరి టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న మన హీరోయిన్స్ వివాహం అయ్యే సమయానికి వాళ్ళ వయసు ఎంతో మీకు తెలుసా..
#1. నయనతార :
సౌత్ ఇండియాలో సినీ ఇండస్ట్రీలో నెంబర్ వన్ గా ఇప్పటికీ కొనసాగుతున్న నయనతార ఈ జూన్ 9న విగ్నేష్ శివన్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. విగ్నేష్ నయనతార కంటే ఒక సంవత్సరం చిన్న వాడు. ఇప్పుడు నయనతార ప్రస్తుత వయసు 37 సంవత్సరాలు.
#2.కాజల్ అగర్వాల్ :
ఎన్నో సక్సెస్‌ను సాధించి కెరియర్ పరంగా దూసుకుపోయిన కాజల్ అగర్వాల్ 2020లో తన చిన్ననాటి స్నేహితుడైన గౌతం కిచ్లు ప్రేమించే వివాహం చేసుకుంది. అప్పుడు కాజల్ వయసు 35 సంవత్సరాలు
#3. శ్రీయ శరన్ :
జూనియర్ ఎన్టీఆర్ నుంచి మెగాస్టార్ చిరంజీవి వరకు అందరితోనూ నటించి అగ్రస్థాయి హీరోయిన్ గా అప్పటిలో పేరుపొందింది. 2018 లో రష్యా బిజినెస్ మాన్ ఆండ్య్రూ ని ప్రేమించి వివాహం చేసుకుంది. వివాహం చేసుకునే సమయానికి శ్రీయ శరన్ వయస్సు 36 సంవత్సరాలు.
#4. సమంత :
నాగచైతన్య సమంత దాదాపు పది సంవత్సరాలు ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి మరీ 2017 అక్టోబర్ లో వివాహం చేసుకున్నారు. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల 2021 సంవత్సరం లో విడాకులతో దూరమయ్యారు. వివాహం చేసుకునే సమయానికి ఈ సమంతా కి 30 సంవత్సరాల వయసు.
#5. ప్రణీత సుభాష్ :
ప్రణీత సుభాష్ 2021 మేలో నితిన్ రాజు ని వివాహం చేసుకున్నారు. అప్పుడు ఆమె వయసు 28 సంవత్సరాలు.
#6.అలియా భట్ :
దాదాపు నాలుగు సంవత్సరాల పాటు రణబీర్ కపూర్‌తో ప్రేమాయణం నడిపించి, ఈ సంవత్సరం ఏప్రిల్ 14 వ తేదీన రణబీర్ ఆలియా భట్ జంట వివాహంతో ఒకటి అయ్యింది. ఇప్పుడు ఆలియాభట్ ప్రస్తుత వయస్సు 29 సంవత్సరాలు.
#7.నజ్రియా నజీమ్ :
నజ్రియా నజీమ్ అతి చిన్న వయసులోనే ఫహద్ ఫాసిల్ ని ఆగస్టు 21 2014 న వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకునే సమయానికి నజ్రియా నజీమ్ వయస్సు కేవలం 19 సంవత్సరాలు మాత్రమే.
End of Article