వైరల్ అవుతున్న “విరాట పర్వం” స్టోరీ.. సినిమా చివరిలో ట్విస్ట్ అదేనా..? విషాదంతో ముగుస్తుందా..?

వైరల్ అవుతున్న “విరాట పర్వం” స్టోరీ.. సినిమా చివరిలో ట్విస్ట్ అదేనా..? విషాదంతో ముగుస్తుందా..?

by Anudeep

Ads

రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవి ప్రధాన పాత్రలలో కలిసి నటించిన చిత్రం విరాటపర్వం. ఈ చిత్రానికి వేణు ఊడుగుల దర్శకత్వం వహించారు. సురేష్ బాబు మరియు సుధాకర్ చెరుకూరి ఈ చిత్రానికి నిర్మాణ సారథ్యం వహించారు. ఈ విరాటపర్వం చిత్రం 1990 నాటి సీరియస్ పోలిటికల్ బ్యాక్ డ్రాప్ గా రూపొందింది. ఈ జూన్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది విరాటపర్వం చిత్రం.

Video Advertisement

1990 కాలంలో విప్లవ భావాలపై ఆకర్షితురాలై నక్సల్ ఉద్యమంలో చేరిన తూము సరళ జీవిత కథ ఆధారంగా రూపొందింది. ఈ చిత్రంలో సాయి పల్లవి వెన్నెల క్యారెక్టర్ లో నటించారు. ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా ఏంటి ఈ విధంగా జరుగుతుంది అంటూ నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

 

ఇంతకీ విషయం ఏమిటంటే.. విడుదలైన టీజర్ లో రానా దగ్గుబాటి మరియు సాయి పల్లవిలది ఒక అందమైన ప్రేమకథగా విరాట పర్వం చిత్రంలో రూపొందుతుంది. మంచి విప్లవ భావాలు కలిగిన నక్సల్స్ నాయకుడిగా రానా నటించగా, ఆయన భావాలు నచ్చి రానాని ప్రేమించిన యువతిగా సాయిపల్లవి నటిస్తోంది.

అతని కోసం ఇల్లు విడిచి వెతుక్కొని వెళ్ళిపోతుంది. కష్టాలు పడుతూ ఏదో విధంగా అతని వద్దకు చేరుతుంది. కాని రాణాకు తన ప్రేమను వ్యక్తం చేసే సమయం లేదు. పోలీసులు వెంటాడుతున్న నూతన రక్షించుకుంటూ సాయి పల్లవి అయిన తన వెంట పెట్టుకుని తీసుకు వెళుతూ ఉంటాడు. ఒక చిన్న అపార్ధం వల్ల సాయి పల్లవిని పోలీస్ రహస్య గూడచారి గా భావించి చంపేస్తాడు. తరువాత ఆమె తన ప్రేమను వ్యక్తం చేయడానికి రాణా దగ్గరికి వచ్చింది అనే విషయం తెలుసుకుంటాడు. ఒక నిర్దోషి ని నిజాన్ని తెలుసుకోకుండా ఎంత క్రూరంగా ప్రవర్తించాను అనే విషయాన్ని గ్రహిస్తాడు.

virataparvam trailer cut

అతను చేసింది తప్పు అనే అపరాధభావంతో ఆత్మ హత్య చేసుకుంటాడు. లీకైన స్టోరీ ద్వారా చివరికి సాయిపల్లవి చనిపోయిందంటూ షాక్ కు గురైన  నెటిజన్లు చివరికి ఇలా జరిగింది ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.


End of Article

You may also like