Ads
లేడీ సూపర్ స్టార్ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ ల ప్రేమ వివాహం ఇటీవలే జరిగిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఈ వివాహానికి సంబంధించిన అన్ని ఖర్చులు నయన్ కానీ, విఘ్నేష్ కానీ పెట్టుకోలేదు అట!
Video Advertisement
మరి ఆ ఖర్చులు ఎవరివి?? అనే కదా మీ సందేహం! ఇప్పటి వరకు సినిమాలు, వెబ్ సిరీస్ లకు డబ్బులు చెల్లించి ప్రసారం చేసే నెట్ ఫ్లిక్స్ ఓ.టి.టి సంస్ధ ఆ వివాహానికి సంబంధించిన ఖర్చులు అన్ని పెట్టుకుంది అని కోలీవుడ్ సమాచారం.
అయితే ప్రతిఫలంగా ఆ పెళ్లి వీడియోని నెట్ ఫ్లిక్స్ త్వరలో తమ ఛానెల్ లో స్ట్రీమింగ్ చేయబోతోంది అని ఊహాగానాలు వెలువడుతున్నాయి. మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో ఏర్పాటు చేసిన ఈ వివాహం మొత్తాన్ని ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ మీనన్ తో వీడియో షూట్ చేయించింది అట నెట్ ఫ్లిక్స్ సంస్ధ.
ఈ వివాహానికి గాను సుమారు 25 కోట్ల వరకు ఆ సంస్ధ కి ఖర్చు అయినట్లు చెబుతున్నాయి కోలీవుడ్ వర్గాలు. అందుకే అంగరంగ వైభవం గా జరిగిన ఆ పెళ్లి కి సంబంధించి ఎలాంటి సమాచారాన్ని బయట కి విడుదల అవ్వకుండా పగడ్బందీ గా వీడియో షూట్ నిర్వహించినట్లు సమాచారం. మరోపక్క నయన్, విఘ్నేష్ లు తమ వివాహం రోజున తమిళనాడులోని అనాధ శరణాలయాలలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు అని, ఆ విషయం కూడా ఎక్కడా ప్రచారం కానివ్వలేదు అని, మరొక వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది.
మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే నెట్ ఫ్లిక్స్ తమ ఛానెల్ లో ఆ పెళ్లి వీడియో స్ట్రీమింగ్ చేసే వరకు ఎదురు చూడాల్సిందే. ఒకవేళ ఆ వార్త నిజం అయ్యి నయన్ కి నెట్ ఫ్లిక్స్ అలాంటి బంపర్ ఆఫర్ ఇస్తే ఇక పై జరిగే ఏ హీరో లేదా హీరోయిన్ ల వివాహానికి ఎలాంటి ఖర్చు అవ్వకుండా నయన్ ఒక కొత్త దారి చూపించింది అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
End of Article