పెళ్లి తర్వాత “నయనతార” పెట్టిన కండిషన్స్ ఇవేనా..?

పెళ్లి తర్వాత “నయనతార” పెట్టిన కండిషన్స్ ఇవేనా..?

by Anudeep

Ads

లేడీ సూపర్ స్టార్ నయనతార పెళ్లి తర్వాత తన సినీ జీవితంలో కొన్ని కట్టుబాట్లు విధించుకోవాలి అని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆమె తన వద్దకు వచ్చే నిర్మాతలకు, డైరెక్టర్లకు కొన్ని షరతులు విధిస్తున్నట్టు తెలుస్తుంది.

Video Advertisement

అవి ఏంటి అంటే పెళ్లి తర్వాత ఆమె ఖాళీ సమయాలలోనే సినిమాలు చేస్తానని, తదనుగుణంగానే తన కాల్ షీట్స్ ఉంటాయని, శృంగార భరిత సన్నివేశాల్లోనూ, బికినీ సీన్స్ లో నటించను అని తెగేసి చెబుతుంది అట. ఈ షరతులు కి ఒప్పుకుంటేనే సినిమా చేస్తాను అని, లేకుంటే చెయ్యను అని తన నిర్ణయాన్ని సూటిగా నిర్మాతలకు తెలియజేస్తుంది అని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే నయనతార ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక సమంతా కారణం అయ్యి ఉంటుంది, అని మరికొంత మంది అభిప్రాయపడుతున్నారు. పెళ్లి తర్వాత సమంతా సూపర్ డీలక్స్, ఫామిలీ మేన్ 2 లాంటి సినిమాల్లో గ్లామర్ హద్దులు దాటి నటించింది. తదనంతరం తాను గాఢంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య తో విడాకులు తీసుకోవడం జరిగింది.

samantha 3

వీరి విడాకుల వెనుక సమంత నటించిన ఆ సినిమా లే కారణం అని ఒక వాదన సినీ వర్గాల్లో ఉంది. అందుకే సమంత ను చూసి నయన్ అలాంటి కఠిన నిర్ణయాలు తీసుకుని ఉంటుంది అని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే పెళ్లి తర్వాత ఎలాంటి హద్దులు పెట్టుకోకుండా సమంతా తన కెరీర్ లో టాప్ గేర్ లో దూసుకుపోతుంటే, ఇటువంటి కఠిన నిబంధనలు పెట్టుకుని నయన్ తన కెరీర్ ని ఎలా మలుచుకుంటుందో చూడాలి.


End of Article

You may also like