నయన్ వివాహానికి తన తల్లి రాకపోవడానికి కారణమిదేనా!?

నయన్ వివాహానికి తన తల్లి రాకపోవడానికి కారణమిదేనా!?

by Anudeep

Ads

ఎన్నో ఏళ్ల తమ ప్రేమ జీవితానికి ముగింపు పలుకుతూ వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు నయనతార, విఘ్నేష్ శివన్. ఇటీవలే వారి వివాహం మహాబలేశ్వరంలోని ఓ రిసార్ట్ లో అతి ముఖ్యమైన అతిథుల మధ్య అంగరంగవైభవంగా జరిగింది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ నుంచి అనేకమంది సెలబ్రిటీలు ఈ వివాహానికి హాజరైనట్టు సమాచారం.

Video Advertisement

అయితే నయనతార వివాహానికి తన తల్లి ఒమన కురియన్ (Omana Kurian) వివాహానికి హాజరు కాలేదు. కూతురు పెళ్లికి తల్లి రాకపోవడంతో ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
నయన్ తల్లికి వారి వివాహం ఇష్టం లేకపోవడం వల్లనే హాజరు కాలేదా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పలువురు సందేహిస్తున్నారు. అయితే.. ఈ కొత్త జంట మొన్న నయన్ తల్లి వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే వివాహానంతరం నయన్ ఇక ముందు చేయబోయే సినిమాలకు కొన్ని కండిషన్స్ పెట్టనుందని తెలుస్తుంది. భర్త విఘ్నేష్ తీసే పలు సినిమాల్లో కూడా నయన్ కనిపించే అవకాశం ఉంది.


ఇప్పటి వరకు అనేక వివాదాల కారణంగా సినిమా ఫంక్షన్లకు, ప్రమోషన్లు దూరంగా ఉంటూ వస్తున్నారు నయన్.  అయితే ఇక ముందు మనం నయన్ ను ప్రీ రిలీస్ ఈవెంట్స్, సక్సెస్ మీట్ లలో కూడా చూసే అవకాశం ఉంది. వివాహానంతరం వీరిరువురు కేరళలోని  వివిధ పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటున్నారు. నయన్, విఘ్నేష్ అభిమానులు వీరి వైవాహిక జీవనం అన్యోన్యంగా సాగాలని కోరుకుంటున్నారు.


End of Article

You may also like