ఇదెక్కడి రిజైన్ లెటర్ రా మావా.? దెబ్బకి బాస్ షాక్ అయ్యి ఉంటాడు.!

ఇదెక్కడి రిజైన్ లెటర్ రా మావా.? దెబ్బకి బాస్ షాక్ అయ్యి ఉంటాడు.!

by Anudeep

Ads

లెటర్ రాయడం అనేది ఒక కళ. అది లవ్ లెటర్ అయినా లీవ్ లెటర్ అయినా ఆఖరికి రిజైన్ లెటర్ అయినా సరే. అయితే రిజైన్ లెటర్ ని కొంతమంది లెంగ్తీగా రాస్తారు. నేను మీ సంస్థలో పని చేయడం వలన పలానా పలానా విషయాలు  నేర్చుకున్నాను వాటి వలనే నేను ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉన్నాను అంటూ సుదీర్ఘంగా రాస్తారు. కానీ ఓ వ్యక్తి రెండు ముక్కల్లో తేల్చేశాడు.

Video Advertisement

మనం ఏదైనా సంస్థలో పని చేసి మానేయాలి అనుకున్నప్పుడు రిజైన్ లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది కానీ చాలా మంచి చడి చప్పుడు లేకుండా జీతం పడగానే మానేస్తారు.
అలా చెప్పకుండా వెళ్లినా తప్పులేదు కానీ చెప్పి వెళ్తే గౌరవంగా ఉంటుంది. మనం ఆ సంస్థలో నేర్చుకున్న కొన్ని విషయాలు ప్రస్తావించడం వలన వారికి కృతజ్ఞతలు చెప్పినట్టుగా ఉంటుంది.
అయితే తాజాగా సోషల్ మీడియాలో ఓ రిజైన్ లెటర్ వైరల్ అవుతుంది. అది చాలా షార్ట్ అండ్ స్వీట్ గా ఉంది. “డియర్ సార్.. రిజైన్ లెటర్.. బై.. బై.. సార్..” అని చివర ఓ సంతకం మాత్రమే ఉంది.

ఇప్పుడు ఈ స్వీట్ అండ్ షార్ట్ లెటర్ ను చాలామంది లైక్ చేస్తూ..  సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఈ ఫొటోను కావేరి అనే యూజర్ ట్విటర్ లో పంచుకున్నారు. దీన్ని చూసి మరికొంతమంది క్రేజీ లెటర్స్ ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేస్తున్నారు. ఇంకొందరు తమ సబార్డినేట్ లు పంపిన రిజైన్ లెటర్స్ స్క్రీన్ షాట్ తీసి పంచుకుంటున్నారు.


End of Article

You may also like