Ads
మన దేశం టెక్నాలజీ పరంగా ముందుకు దూసుకుపోతోంది. ప్రతి రంగంలోనూ మార్పులు వచ్చాయి. ప్రతి చిన్న పనికి కూడా మనం యంత్రాలపై ఎక్కువగా ఆధారపడి బ్రతుకుతున్నాము.
Video Advertisement
అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. ఇప్పుడు వ్యవసాయ పనులు కూడా మానవ శక్తి కన్నా యంత్రాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడిన కూడా సమయం కలిసొస్తుందని.
అయితే ఇప్పుడు నేటికి కూడా సంప్రదాయంగా వ్యవసాయం చేసే రైతులు చాలామంది ఉన్నారు. నేలను సారవంతం చేసే దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు కష్టపడి శ్రమించి పని చేస్తూ ఉంటారు.
రైతుల్లో కొందరూ యంత్రాలను ఉపయోగించుకునే అంత శక్తి వాళ్ళ దగ్గర ఉండదు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఈ రైతు చేసిన పనికి అందరూ వాట్ ఏ స్మార్ట్ ఫార్మర్ అని అంటున్నారు.
ఇతను ఏం చేశాడంటే ఈ వీడియోలో తన గోధుమ పంటను ఎంతో అవలీలగా కన్ను మూస్తే కన్ను తెరిస్తే వ్యవధిలోనే చకచకా మంటూ కోస్తున్నాడు. ఇతను ఒక గంప లాంటి వెడల్పాటి పరికరములు ఒకేసారి ఒక వరస గోధుమ గడ్డిని కోయటం మనకి కనిపిస్తుంది. ఇతను తన వ్యవసాయ పరికరంలో టెక్నిక్ ఉపయోగించి సృజనాత్మకంగా వ్యవసాయ పనుల్లో కొత్త విధానాన్ని రూపొందించాడు. తను చేసే వ్యవసాయ పని విధానానికి నెటిజన్లు సైతం ఫిదా అయిపోయారు.
వర్క్ స్మార్ట్, నాట్ హార్డ్ అనే విధంగా ఇతను పంటను కోసే విధానం చిత్రించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిజంగా ఇతను పంటను కోయడానికి అవలంబించిన కొత్త విధానానికి హ్యాట్సాఫ్ అంటున్నారు నెటిజన్లు. ఈ వీడియో దాదాపు ఒక మిలియన్ల వీక్షకులను ఆకర్షించింది.
Between tradition and modernity.
Harvest wheat.😃😃😃 pic.twitter.com/gbv0oaFLyf— Tansu Yegen (@TansuYegen) June 15, 2022
End of Article