చెల్లెలితోనే లవర్ గా నటించాల్సి వచ్చింది.. నేను చెయ్యను అనేసరికి ఏమైందంటే?

చెల్లెలితోనే లవర్ గా నటించాల్సి వచ్చింది.. నేను చెయ్యను అనేసరికి ఏమైందంటే?

by Anudeep

Ads

బుజ్జిగాడు సినిమా అందరూ చూసే ఉంటారు.. ఈ సినిమాలో ప్రభాస్, త్రిష హీరో హీరోయిన్లుగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో చిన్నప్పటి ప్రభాస్, త్రిష లుగా నటించింది ఎవరో తెలుసా? దర్శకుడు పూరి జగన్నాధ్ పిల్లలు ఆకాష్, పవిత్రలే. ఈ విషయం చాలా మందికి తెలుసు.

Video Advertisement

ఇటీవల ఓ ఇంటర్వ్యూ లో పాల్గొన్న పూరి తనయుడు ఆకాష్ “బుజ్జిగాడు” సినిమా షూటింగ్ నాటి ముచ్చట్లను చెప్పుకొచ్చారు. చిన్నప్పుడే తన చెల్లెలు పవిత్రతో కలిసి బుజ్జిగాడు సినిమాలో నటించారు.

bujjigadu 1

బుజ్జిగాడు సమయంలో అన్నా చెల్లెల్లు అయినా పవిత్ర, ఆకాష్ లు లవర్స్ గా నటించారు. ఈ విషయం గురించి ప్రస్తావిస్తూ స్కూల్ లో ఏమి అనలేదా అని ఇంటర్వ్యూ లో అడిగారు. దానికి సమాధానం ఇచ్చిన ఆకాష్.. స్కూల్ లో అందరు కామెడీ చేసి నవ్వేశారని అన్నారు. అయితే.. ఈ సినిమాలో వీరిద్దరి నటన అదిరిపోయిందనే చెప్పాలి.

bujjigadu 2

అయితే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి ముందే.. ఆకాష్ తండ్రి పూరితో ఇలా పవిత్రతో కలిసి నటించనని, చూడడానికి బాగోదని చెప్పేశాడట. అయితే.. పూరి ఆకాష్ మాటలను పట్టించుకోలేదు. పెద్దయ్యాక నీ హీరోయిన్ నే పెళ్లి చేసుకుందువులే గాని.. ఈసారికి ఇలా చేసేయమని చెప్పారట. ఇది యాక్టింగ్ మాత్రమే.. ఇప్పుడు నటించేసేయ్ అని చెప్పడంతో ఆకాష్, పవిత్రలు ఆ సినిమాలో నటించారట.


End of Article

You may also like