చెల్లి పెళ్ళికి తండ్రి విగ్రహం చేయించడం వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా? ఇందుకు ఎంత ఖర్చయ్యిందంటే?

చెల్లి పెళ్ళికి తండ్రి విగ్రహం చేయించడం వెనుక ఎంత కథ నడిచిందో తెలుసా? ఇందుకు ఎంత ఖర్చయ్యిందంటే?

by Anudeep

Ads

పెళ్లి ప్రతి ఒక్కరికి జీవితంలో ఎంతో ముఖ్యమైన ఘట్టం. అయితే.. ఆ వేడుకను కన్నవాళ్ళు కన్నుల పండుగగా చేస్తే ఆ సంతోషం వేరుగా ఉంటుంది. అయితే..ఆ అదృష్టం అందరికీ ఉండకపోవచ్చు. పెళ్లి చేసుకోవడానికి ముందే తల్లి తండ్రులలో ఎవరో ఒకరిని దూరం చేసుకోవాల్సి వచ్చినా ఆ బాధ వర్ణనాతీతంగా ఉంటుంది.

Video Advertisement

అయితే.. ఇటీవల జరిగిన ఓ పెళ్ళిలో పెళ్లికూతురు అన్న తన చెల్లికి ఎప్పటికీ మర్చిపోలేని గిఫ్ట్ ని ఇచ్చాడు. అతని పేరు ఆవుల ఫణి. చనిపోయిన తండ్రిని తీసుకొచ్చి ఆమెకు గిఫ్ట్ గా ఇచ్చాడు. అలా ఎలా ఇచ్చాడు అని ఆలోచిస్తున్నారా?

wax statue 3

పెళ్ళికి నాన్న లేరే అన్న కలత అందరిని కలిచివేస్తోంది. ఆ తరుణంలోనే అతనికి తన తండ్రి మైనపు విగ్రహాన్ని చేయించాలి అన్న ఆలోచన వచ్చింది. అనుకున్నదే తడవుగా.. దాని గురించి ఎంక్వైరీ చేసాడు. తన తండ్రి రూపు రేఖలను పోలి వుండేట్లుగా మైనపు విగ్రహాన్ని తయారు చేయించాడు. చివరగా.. పెళ్లి బట్టలు తొడిగి చూడగా.. అచ్చం వారి తండ్రి తిరిగి వచ్చినట్లే ఉంది.

wax statue 1

ఆ విగ్రహాన్ని సరాసరి కల్యాణ మండపానికి తీసుకొచ్చేసి తన చెల్లిని, అమ్మని సర్ ప్రైజ్ చేసాడు. ఈ విగ్రహాన్ని చూడగానే ఆ పెళ్లి కూతురు ఒక్కసారిగా స్టన్ అయిపోయింది. అయితే.. తల్లిని, చెల్లిని ఇలా సర్ ప్రైజ్ చేయడానికి ఫణి చాలానే కష్టపడ్డాడు. ఫణి, అతని భార్య అమెరికాలోనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా పని చేస్తున్నారు. కరోనా వచ్చినప్పటి నుంచి ఇండియాకు వచ్చి ఇంటి నుంచే పని చేస్తున్నారు. ఏడాది క్రితమే కరోనా కారణంగా ఫణి తండ్రి మరణించారు.
wax statue 2

చెల్లి పెళ్ళికి తండ్రి విగ్రహం తీసుకురావడం కోసం ఏడాది క్రితం నుంచే ఫణి ప్రయత్నాలు ప్రారంభించాడు. బెంగళూర్ కు వెళ్లి అక్కడ మైనపు విగ్రహాలు తయారు చేసే కంపెనీ కోసం వెదికాడు. అందుకు అవసరం అయిన మైనపు మెటీరియల్ ను విదేశాల నుంచి తెప్పించాడు. అయితే.. కరోనా ఆంక్షల కారణంగా ఈ విగ్రహం తయారు చేయించడానికి ఏడాది సమయం పెట్టింది. కానీ.. అనుకున్నట్లే చెల్లి పెళ్లి సమయానికి విగ్రహాన్ని తెప్పించి అందరిని సర్ ప్రైజ్ చేసాడు. తన చెల్లి పెళ్ళికి నాన్న లేడు అన్న బాధ ఉండకూడదు అని భావించిన ఈ అన్న చేసిన పని అందరిని ఆకర్షిస్తోంది. సూపర్ బ్రదర్ అంటూ నెటిజన్స్ ప్రశంసిస్తున్నారు.


End of Article

You may also like