Ads
పెళ్లి అనేది జీవితంలో చాలా మధురమైనది. పెళ్లితో ఇద్దరు వ్యక్తులే కాదు రెండు కుటుంబాలు కూడా ఒకటి అవుతాయి. పెళ్లికి ముందు నిశ్చితార్థం చేస్తారు. ఆ తర్వాత పెళ్లిని జరుపుతారు. నిశ్చితార్థం అనేది అధికారిక ప్రకటన. వధూవరుల యొక్క సంబంధం అధికారికంగా మారిందని నిశ్చితార్థంతో తెలుస్తుంది.
Video Advertisement
ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్న వాళ్ళల్లో అప్పటికే అన్ని ఒకరికొకరు తెలుసుకుని ఉంటారు. కానీ పెద్దలు కుదిర్చిన వివాహంలో మాత్రం నిశ్చితార్ధం తర్వాత మాత్రమే ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి అవుతుంది. అయితే ఇటువంటి పరిస్థితిలో అబ్బాయి, అమ్మాయి కూడా జాగ్రత్తగా ఉండాలి.
లేదంటే పెళ్లి సంబంధం చెడిపోయే అవకాశం కూడ ఉంటుంది. ఇలాంటివి చాలానే మనం చూసే ఉంటాం. మీకు కూడా ఒక అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ నిశ్చితార్ధం జరిగి ఉంటే.. మీరు ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లయితే… వీటిని తప్పక గుర్తుపెట్టుకోండి.
#1. ఎక్కువ చెప్పుకోవడానికి ప్రయత్నించవద్దు:
చాలామంది తమ గురించి ఎక్కువ చెప్పుకోడానికి చూస్తూ ఉంటారు. సందు దొరికితే చాలు ఇతరులపై కూడా తమ ఆధిపత్యాన్ని చాటుతారు. ఇలా సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం వల్ల ఎదుటి వాళ్ళకి చికాకు వస్తుంది. వైవాహిక జీవితంతో ఇద్దరు వ్యక్తులు జీవిత భాగస్వాములు అవుతారని గుర్తుపెట్టుకోవాలి.
అందుకని ఎప్పుడూ కూడా గొప్పగా చెప్పుకుంటూ ఒకరిని అణచివేయడానికి చూడకూడదు. ఒకరి కోరికలను ఒకరు గౌరవించుకోవడం, ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం చేస్తే జీవితాంతం ఆనందంగా ఉండొచ్చు.
#2. అతిగా మాట్లాడితే ఇబ్బందులు:
నిశ్చితార్థం అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి గంటల కొద్దీ ఫోన్లలో మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజానికి ఈ సమయంలో ఒకరినొకరు గమనిస్తూ ఉంటారు. ఎక్కువగా మాట్లాడితే తప్పుగా భావిస్తారు. పైగా ఎక్కువ మాట్లాడటం వల్ల ఏదో ఒకటి స్లిప్ అవుతూ ఉంటారు. కొన్ని కొన్ని సార్లు ఒక మాట జారితే ఎన్నో సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. కాబట్టి అదుపులో ఉండటం చాలా అవసరం.
#3. చెడుగా కుటుంబం గురించి చెప్పొద్దు:
ఎవరైనా సరే తమ కుటుంబాలను గౌరవించుకోవాలి. అందుకని ఎప్పుడూ కుటుంబం గురించి చెడ్డగా చెప్పుకోకూడదు. వివాహం అయ్యేంత వరకు కూడా ఈ విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి.
#4. రెస్పెక్ట్ తో మాట్లాడడం:
మీయొక్క పార్టనర్ కి మీరు గౌరవం ఇవ్వడం చాలా ముఖ్యం. మీ బంధం బాగుండాలంటే గౌరవాన్ని ఇచ్చి పుచ్చుకోవాలి. ఎప్పుడూ కూడా అసభ్యంగా ప్రవర్తించద్దు. గౌరవం ఉంటేనే బంధం నిలబడుతుంది అని గుర్తుంచుకోవాలి.
featured image source: a screenshot from telugu short film “nischitartam“
End of Article