Ads
విజయ్ దేవరకొండ నటించిన టాక్సీవాలా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది ప్రియాంక జువాల్కర్.
Video Advertisement
ఆమె అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను తనవైపు ఆకర్షించుకునేలా చేసింది. చేసినవి రెండు చిత్రాలు అయినా ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలానే ఉంది.
ఈ ముద్దుగుమ్మ చిత్రాలతో బిజీగా లేకపోయినా, సోషల్ మీడియాలో మంచి ఆక్టివ్ గా ఉంటుంది. తన లేటెస్ట్ ఫోటోలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ కుర్రకారుమతులు పోగొడుతుంది ప్రియాంక. వన్ మిలియన్ ఫాలోవర్స్ ని సంపాదించుకున్నది అంటే ప్రియాంకాకు ఏ రేంజ్ లో ఫాలోయింగ్ ఉందో అర్థమవుతుంది.
అయితే ప్రస్తుతం ప్రియాంక తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఒక ఫోటోని పోస్ట్ చేసింది. ఇప్పుడు ఆ ఫోటో కాస్త వైరల్ గా మారింది. ఆ ఫోటో ను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ హిమ్ పక్కన లవ్ సింబల్ ఎమోజి పెట్టింది.
ఆ ఫోటో ఏంటంటే ఒక రెస్టారెంట్లో ప్రియాంకకు ఎదురుగా ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. ఎదురుగా ఉన్న వ్యక్తి ఫోటోలు తీస్తుంటే ప్రియాంక క్యూట్ ఎక్స్ప్రెషన్ తో ఫోజులు ఇస్తుంది. అతను ఎవరై ఉంటారని అందరిలో ఇప్పుడు ఒక ప్రశ్నతలెత్తింది.
ప్రియాంక చేసిన ఈ పోస్ట్ చేసిన ఫోటో గాను తనతో పాటు ఫోటోలో ఉన్న వ్యక్తి ఇండియన్ క్రికెటర్ వెంకటేశ్ అయ్యారే అయి ఉంటాడు అని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు వెనకనుంచి చూస్తుంటే ఖచ్చితంగా వెంకటేశ్ అంటూ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అతను ఎవరనేది సస్పెన్స్ గానే మిగిలిపోయింది. అతను నిజంగానే వెంకటేశ్ లేదా మరొకరు అనేది ప్రియాంక ద్వారానే బయటకు తెలియాలి.
https://www.instagram.com/p/CfL5vwKJceG/?igshid=YmMyMTA2M2Y=
End of Article