అందుకేనేమో “సాయి పల్లవి”ని సౌందర్యతో పోల్చేది..! ఈ వీడియో చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది..!

అందుకేనేమో “సాయి పల్లవి”ని సౌందర్యతో పోల్చేది..! ఈ వీడియో చూస్తే నిజమేనేమో అనిపిస్తుంది..!

by Anudeep

Ads

అందరం సినిమాలని చూసి ఎంజాయ్ చేసే వాళ్ళమే కానీ అందులో పని చేసే వాళ్లంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. అందుకే పెద్ద పెద్ద డైరెక్టర్లు మరియు ప్రొడ్యూసర్స్ సైతం వాళ్ల పిల్లల్ని ఇండస్ట్రీలోకి తీసుకురావాలి అంటే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. అందులోను ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే బయట చాలా బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ అవుతూ ఉంటాయి.

Video Advertisement

సినిమా అంటేనే రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో వెండితెరకి మరికొన్ని అందాల రంగులు అద్దే బాధ్యత హీరోయిన్ మీదే ఉంటుంది. సినీ గ్లామర్ ప్రపంచంలో ఎంత పెద్ద హీరోయిన్ అయినప్పటికీ స్కిన్ షో తప్పదు. వీటికి దూరంగా ఉంటూ తమ నటన ద్వారా అభిమానులను సొంతం చేసుకున్న సహజ నటులు సౌందర్య, సాయి పల్లవి.

అయితే ఇదే విషయాకి సంబంధించి.. ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అంటే అంత బ్యాడ్ ఏం కాదు, మనం ఒక పని చేయడానికి వచ్చాం దేవుడు మన ద్వారా దేవుడు ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు అది జరుగుతుంది అంది సాయి పల్లవి. అయితే ఇదే విషయంపై గతంలో సహజ నటి సౌందర్య కూడా స్పందిస్తూ.. సినిమాల్లోకి రండి, ఇట్స్ నాట్ ఆ బ్యాడ్ వరల్డ్, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్లంతా బాగా చదువుకొని, ఉన్నత కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఇతర వృత్తుల లాంటిదే అంటూ సౌందర్య కూడా ఇండస్ట్రీ గురించి పాజిటివ్ గా స్పందించింది.

ఒకరంగా చూసుకుంటే.. సౌందర్య గారు సాయి పల్లవి ఇద్దరు ఇండస్ట్రీ గురించి ఓకే విధంగా స్పందించారు. పైగా ఇండస్ట్రీలో ఇద్దరి ప్రవర్తన కూడా ఒకేలా ఉంటుంది. వస్త్రధారణ విషయంలో కూడా ఇద్దరు సంప్రదాయానికే ఓటు వేసి మంచి సక్సెస్ సాధించారు.  ఒకప్పుడు ఇండస్ట్రీ గురించి సౌందర్య మాట్లాడిన మాటలను, ఇప్పుడు సాయి పల్లవి మాటలు ఓకే రకంగా ఉండడంతో నేటి తరం సౌందర్య.. సాయి పల్లవి అని కొందరు నెటిజన్లు ప్రశంసిస్తుంటే.. ‘సాయి సౌందర్యం’ అని కొందరు పొగుడుతున్నారు. ఇప్పుడు వీరి మాటలకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియో ఏంటో కింద ఇవ్వబడింది మీరు చూడండి.

watch video :

https://www.instagram.com/reel/Ce5_5yaFEuJ/?igshid=YmMyMTA2M2Y=


End of Article

You may also like