Ads
తెలుగు సినిమాని ప్రపంచ స్థాయిలో నిలబెట్టిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. దర్శకులందరిలోకి రాజమౌళిది ప్రత్యేక పంథా. కథ దగ్గర నుండి కథానాయకుల వరకు ప్రతి ఒక్కటి పక్కా ఫర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుని రంగంలోకి దిగుతారు. అటువంటి రాజమౌలి సినిమాలో పాత్ర అంటే ఎగిరి గంతేస్తారు సినిమావాళ్లు . తన సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం స్వయంగా రాజమౌలే అడిగితే రిజెక్ట్ చేసింది అర్చనా శాస్త్రి . అప్పుడెందుకు వదులుకున్నానా అని ఇప్పుడు బాధ పడుతుంది.
Video Advertisement
“నేను” సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అయింది అర్చన . తొలుత వేద గా పరిచయం అయినప్పటికి తర్వాత అర్చనగా స్థిరపడింది. నేను , నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలతో అందరికి గుర్తుండిపోయింది. సామాన్యుడు , ఖలేజా చిత్రాల్లో నెగటివ్ పాత్రల్లోనూ నటించి మెప్పించింది. ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలిసి దాదాపు 40 సినిమాల్లో నటించింది. అంతేకాదు బిగ్‌బాస్ తెలుగు తొలి సీజన్‌లో తొలి కంటిస్టెంట్ గా కూడా పాల్గొంది. అయినప్పటికి రావాల్సిన గుర్తింపు రాలేదు .
Also Read: విడాకుల రూమర్స్ పై స్పందించిన హేమచంద్ర, శ్రవణ భార్గవి..! ఇది మంచి విషయమే అంటూ..?
సినిమా అనే రంగుల ప్రపంచంలో ఏ అవకాశం ఎక్కడి నుండి వస్తుందో, వచ్చిన అవకాశం తమని ఎక్కడికి తీసుకెళ్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కోసారి చిన్నపాత్రలే ఆకాశానికి ఎత్తేస్తాయి. మరికొన్ని సార్లు ఎన్ని పాత్రలు చేసినా ప్రేక్షకులు పట్టించుకోని పరిస్థితి. ఏదైనా అవకాశాన్ని మిస్ చేసుకుంటే ఆ బాధ లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. అలాంటి బాధే ప్రస్తుతం అర్చన పడుతుంది. ఒకప్పుడు చేసిన తప్పు తలచుకొని తెగ ఫీల్ అవుతోంది. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆమె తన కెరీర్‌లో చేసిన తప్పుల గురించి పేర్కొంటూ ఆవేదన చెందింది.
“మగధీర సినిమాలో తనకు రాజమౌళి గారు ఛాన్స్ ఇచ్చారని, సలోని పాత్ర కోసం ముందుగా తననే అడిగారని చెప్పింది అర్చన. కానీ అప్పుడు తను కాస్త బిజీగా ఉన్న కారణంగా రిజెక్ట్ చేసారంట. అప్పటికే తాను నటించిన ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ లాంటి సినిమా హిట్ అయ్యి, తన జర్నీ బాగానే సాగుతూ ఉండే చెప్పుకొచ్చింది అర్చన.
Also Read: లైఫ్/కెరీర్ లో ఫెయిల్ అయినప్పుడు… “దినేష్ కార్తీక్” కి తోడుగా ఉన్న ఆ ప్లేయర్ ఎవరో తెలుసా.?
కెరీర్ మొదట్లో బాగానే ఉండింది. కానీ ఆ తర్వాత తాను లీడ్ రోల్స్ చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి, సైడ్ రోల్స్ చేస్తే అవి హిట్ అయ్యాయని అర్చన తెలిపింది. అప్పుడనిపించింది రాజమౌళి ఇచ్చిన ఆఫర్ ఎందుకు రిజెక్ట్ చేశానా? అని చెబుతూ ఫీల్ అయింది అర్చన.
మంచి సమయంలో అంత పెద్ద దర్శకుడ్ని ఎందుకు వదిలేశానా? అని ఇప్పుడనిపిస్తోందని అర్చన చెప్పింది. అంతకముందు యమదొంగ సినిమా లోని పాట కోసం రాజమౌళి సార్ తో పనిచేశానని అర్చన పేర్కొన్నారు.
అంతేకాదు ఆ తర్వాత కూడా మంచి డైరెక్టర్‌తో హీరోయిన్‌గా తనకు పెద్ద సినిమాలో అవకాశం వచ్చిందని, కానీ అప్పుడు తాను ఉన్న పరిస్థితిలో రిజెక్ట్ చేయడంతో, తన బదులుగా వేరే హీరోయిన్‌ని తీసుకున్నారని, ఆ మూవీ పెద్ద హిట్ అయ్యిందని అర్చన చెప్పింది. అయితే ఆ సినిమా ఏంటి? దర్శకుడు ఎవరు అనేది మాత్రం చెప్పలేదు.
మగధీర లో పాటతో పాటు ఆ తర్వాత రాజమౌలి దర్శకత్వం వహించిన మర్యాద రామన్నలో కూడా హీరోయిన్ గా సలోనినే తీసుకున్నారు. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. ఒకవేళ ఆ పాటకి అర్చన ఒప్పుకునుంటే పరిస్థితి మరోలా ఉండేది. అంతేలెండి , ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం? మనకు దక్కనిది మనది కాదు అని మనసుకి సర్ది చెప్పుకోవడం తప్ప ఏం చేయగలం.
watch video:
To Watch Video Click On : Watch On YouTube
End of Article