ప్రముఖ సింగర్లుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రావణ భార్గవి, హేమచంద్ర “సూపర్ సింగర్” కార్యక్రమం ద్వారా పరిచయమై అనంతరం ప్రేమలో పడ్డారు. ఈ జంట పెద్దలను ఒప్పించి 2013 లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక పాప కూడా ఉన్న సంగతి తెలిసిందే.

Video Advertisement

అయితే గత కొన్ని రోజుల నుంచి వీరు విడాకులు తీసుకోబోతున్నారు అని అందుకే విడివిడిగా ఉంటున్నారని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇద్దరూ స్పందించలేదు. కానీ ఇప్పుడు మాత్రం సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ ఈ విషయంపై స్పందించారు. హేమచంద్ర తన సోషల్ మీడియా పోస్ట్ లో ఈ విధంగా రాశారు. “అనవసరమైన వార్తలు నా పాట కంటే తొందరగా వ్యాపిస్తున్నాయి. నా వన్ లవ్ పాట వినండి. లింక్ నా బయోలో ఉంది.” అని రాశారు.

hema chandra and sravana bhargavi responds on their divorce news

ఇదే విషయంపై శ్రావణ భార్గవి మాట్లాడుతూ ఈ విధంగా రాశారు. తన పోస్ట్ లో శ్రావణ భార్గవి, ” గత కొద్ది రోజుల నుండి యూట్యూబ్ వ్యూస్ పెరిగాయి. నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్ పెరిగారు. ఎప్పటి కంటే కూడా ఎక్కువ పని నాకు దొరుకుతోంది. మంచిదే. కరెక్ట్ అయినా తప్పయినా మీడియా అనేది ఒక దీవెన లాంటిది.” అని అర్థం వచ్చేలాగా రాశారు. అలా వీరిద్దరూ ఇప్పుడు ఉన్న వార్తలు అన్నీ పుకార్లు అని చెప్పారు.

Also Read: 45 ఏళ్ళు దాటుతున్నా నటుడు సుబ్బరాజు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

hema chandra and sravana bhargavi responds on their divorce news

ఇలా సెలబ్రిటీల గురించి పుకార్లు రావడం ఇదే మొదటిసారి కాదు. ఎంతో మంది ప్రముఖ సెలబ్రిటీలు విడిపోతున్నారు అంటూ అంతకుముందు చాలా వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఆ సెలబ్రిటీల వరకు కూడా వెళ్లాయి. దాంతో ఈ వార్తలు మరీ ఎక్కువ అవ్వడంతో ఆ సెలబ్రిటీలు కూడా వారి మధ్య ఇలాంటివి ఏమీ లేదు అని చెప్పి స్పందించాల్సిన సందర్భాలు వచ్చాయి. ఇప్పుడు హేమచంద్ర, శ్రావణ భార్గవి కూడా ఈ విషయంపై స్పందించి వారిద్దరి మధ్య అలాంటిది ఏమీ లేవు అని చెప్పారు.

Also Read: తన కెరీర్ ఫెయిల్ అవ్వడానికి అసలు కారణం బయటపెట్టిన అర్చన..! ఆ టైం లో ఓకే అనుంటే.?