Home Filmy Adda 45 ఏళ్ళు దాటుతున్నా నటుడు సుబ్బరాజు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

45 ఏళ్ళు దాటుతున్నా నటుడు సుబ్బరాజు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా..? కారణం తెలిస్తే షాక్ అవుతారు..!

by Anudeep

సుబ్బరాజు.. తెలుగు ఇండస్ట్రీ లో పరిచయం అవసరం లేని క్యారెక్టర్ ఆర్టిస్ట్. చూడడానికి హీరోలాంటి ఫిజిక్ ఉన్నా.. అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయ్యారు సుబ్బరాజు. ఆయన చూడ్డానికి యంగ్ గానే కనిపిస్తారు. కానీ.. ఆయన వయసు 45 సంవత్సరాలు దాటేస్తోంది.

అయితే.. వయసు 45 దాటుతున్నా.. నటుడు సుబ్బరాజు ఇప్పటివరకూ పెళ్లి చేసుకోలేదు. ఎలాంటి పాత్రలో అయినా తన సత్తా చాట్ సుబ్బరాజు పెళ్ళికి మాత్రం దూరంగా ఉండిపోయారు.

subbaraju 1

తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలకు, కమెడియన్ పాత్రలలోనూ.. సీరియస్ పాత్రలలో కూడా సుబ్బరాజు సరిగ్గా సరిపోతుంటారు. ఎలాంటి పాత్రను ఇచ్చినా ఆయన అవలీలగా చేసేస్తుంటారు. మిర్చి, బాహుబలి సినిమాలలో ఆయన పాత్ర ప్రేక్షకులకు మరింతగా కనెక్ట్ అయ్యింది. ఆయన తెలుగువారికి మరింత చేరువయ్యారు. ఎటువంటి రోల్ లో అయినా యిట్టె ఇమిడిపోయే సుబ్బరాజు గురించి అందరికీ తెలుసు.

subbaraju 2

కానీ, సుబ్బరాజు పర్సనల్ లైఫ్ గురించి చాలా మందికి తెలియదు. అసలు 45 సంవత్సరాల వయసు వచ్చినా.. ఆయన ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదన్న విషయమే చాలా మందికి తెలీదు. ఈ విషయమై ఓ సారి సుబ్బరాజుని ప్రశ్నించగా.. ఆయన షాకింగ్ ఆన్సర్ ఇచ్చారు. పెళ్లి జరగడం వేరు, చేసుకోవడం వేరు అని అన్నారు. జరగడం అంటే.. మనకి ఇష్టం లేకపోయినా పెద్దల బలవంతంతో పెళ్లి బలవంతంగా జరిగిపోవడం అన్నారు. తనకు అలాంటి అవసరం రాలేదని.. నాకు నచ్చినప్పుడే పెళ్లి చేసుకుంటానని సుబ్బరాజు చెప్పుకొచ్చారు.

 

watch video:

You may also like