Ads
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అమ్మాయిల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బాహుబలి తర్వాత ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో ప్రభాస్ బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది ప్రభాస్ నటించిన ఆదిపురుష్, సలార్ సినిమాలు కొన్ని నెలల గ్యాప్ లో విడుదల కానున్నాయి.
Video Advertisement
ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సలార్ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా కేజీఎఫ్2 ను మించి ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ నాగ్ అశ్విన్ తెరకెక్కుతున్న వర్కింగ్ టైటిల్ ‘ప్రాజెక్ట్ కే’ టీమ్ కు పార్టీ ఇచ్చారని సమాచారం.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ప్రభాస్ ఇచ్చిన పార్టీకు అమితాబ్, రాఘవేంద్ర రావు, దుల్కర్ సల్మాన్, నాగ్ అశ్విన్, ప్రశాంత్ నీల్ హాజరయ్యారు. ఈ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రాజెక్ట్ కే షెడ్యూల్ తాజాగా పూర్తి కావడంతో పాటు ప్రభాస్ ఈ సినిమా ఔట్ పుట్ విషయంలో సంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఈ కారణంగానే ప్రభాస్ పార్టీ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
ప్రభాస్ కు జోడీగా దీపికా పదుకొనే ఈ సినిమాలో నటిస్తుండగా అమితాబ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ప్రాజెక్ట్ కే సినిమా 400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమా ప్రభాస్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశం అయితే ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. రాధే శ్యామ్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టగా రానున్న ప్రాజెక్ట్ కే, ఆది పురుష్, సలార్ మూవీలతో అభిమానులను అలరించనున్నాడు.
ప్రభాస్ ఒక్కో సినిమాకు 100 కోట్లు రెమ్యునరేషన్ ను అందుకుంటున్నారు. సినిమా సినిమాకు ప్రభాస్ కు క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటారేమో చూడాలి. అలాగే అర్జున్ రెడ్డి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ అనే మూవీలో కూడా ప్రభాస్ నటించనున్నాడు.
End of Article