ప్రపంచంలోనే అందరికంటే అందమైన మహిళ అయిన ఈమె గురించి… ఈ విషయాలు మీకు తెలుసా..?

ప్రపంచంలోనే అందరికంటే అందమైన మహిళ అయిన ఈమె గురించి… ఈ విషయాలు మీకు తెలుసా..?

by Anudeep

Ads

ఒక మనిషిని చూడగానే మనకు మొదట కనిపించేవి రంగు, రూపమే. ఆ రూపాన్ని బట్టే వారి అందంపై ఓ అంచనాకు వస్తాం.. కానీ అందం అనేదానికి సరైన నిర్వచనాన్ని మాత్రం ఎవరు ఇవ్వలేరు. ఒకరికి అందం అనిపించింది ఇంకొకరికి యావరేజ్ గానే ఉంటుంది.

Video Advertisement

అయితే అందానికి అసలైన నిర్వచనం ఇవ్వడానికి లండన్‌లోని సెంటర్ ఫర్ అడ్వాన్స్‌డ్ ఫేషియల్ కాస్మెటిక్, ప్లాస్టిక్ సర్జరీకి చెందిన డాక్టర్ జూలియన్ డి సిల్వా 2016లో ప్రపంచంలో అత్యంత అందమైన ముఖం ఎవరిదో కనుగొనడానికి పురాతన ఫేస్ మ్యాపింగ్ టెక్నిక్ పీ హెచ్ ఐ (PHI) ని ఉపయోగించారు.

ఆమె పరిశోధనలో నటి “అంబర్ హర్డ్” ప్రపంచంలో అత్యంత అందమైన మహిళగా నిలిచింది. కళ్ళు, పెదవులు మరియు ముఖం ఆకారం వంటి లక్షణాల ఆధారంగా ఈ అధ్యయనం అంబర్ హార్డ్ ముఖం అందమైనదని గుర్తించారు. అంబర్ హార్డ్.. ఆక్వామెన్‌, నెవర్‌ బ్యాక్‌ డౌన్‌, డ్రైవ్‌ యాంగ్రీ వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటించింది. ఈమె ‘పైరెట్స్ ఆఫ్ ది కరేబియన్’ అనే హాలీవుడ్ మూవీ హీరో అయినటు వంటి జానీ డెప్ మాజీ భార్య.

అలాగే ది బ్యాట్‌మ్యాన్ నటుడు రాబర్ట్ ప్యాటిన్సన్ ప్రపంచంలో అత్యంత అందమైన పురుషుడిగా గుర్తించారు. పీ హెచ్ ఐ అనేది గ్రీక్ ఫేస్ మ్యాపింగ్ టెక్నిక్. దీనిని గ్రీక్ గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీ 1.618 అని కూడా పిలుస్తారు. ఇది ముఖం ఎంత పరిపూర్ణంగా ఉందో లెక్కించడానికి ఉపయోగించబడుతుంది. డాక్టర్ సిల్వా ఈ టెక్నిక్‌ని ఉపయోగించారు. ఆక్వామ్యాన్లో నటించిన అంబర్ హర్డ్ ముఖం గ్రీక్ గోల్డెన్ రేషియోకి 91.85 శాతం ఖచ్చితమైనదని కనుగొన్నారు. దీంతో ఆమెను ప్రపంచంలోనే అత్యంత అందమైన మహిళగా గుర్తించారు.

https://telugustop.com/she-is-scientifically-the-most-beautiful-face-in-the-world


End of Article

You may also like