“విక్రమ్ హిట్‌లిస్ట్” OTT లో వచ్చేది అప్పుడేనా..?

“విక్రమ్ హిట్‌లిస్ట్” OTT లో వచ్చేది అప్పుడేనా..?

by Mohana Priya

Ads

ఇటీవల కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాకి ప్రస్తుతం తెలుగులో కూడా హిట్ టాక్ వస్తోంది.ఈ సినిమా చివరిలో చూస్తే సూర్య హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అని విక్రమ్ సినిమా చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది.

Video Advertisement

ఈ సినిమా క్లైమాక్స్ లో చూస్తే సూర్య పాత్రని రోలెక్స్ అనే ఒక పాత్రగా పరిచయం చేస్తారు. సూర్య పాత్ర లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అర్జున్ దాస్ తో మాట్లాడుతూ ఉంటారు.

ఖైదీ, విక్రమ్, తర్వాత రాబోయే సూర్య సినిమా మధ్యలో ఏదో ఒక కనెక్షన్ ఉంది అని ఇది చూస్తే అర్థమవుతుంది. అయితే అర్జున్ దాస్ పాత్ర ఖైదీ సినిమాలో కార్తీ పోషించిన ఢిల్లీ పాత్ర గురించి మాట్లాడుతాడు. దీన్ని బట్టి చూస్తే కార్తీ హీరోగా, సూర్య నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతుంది.  ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో విడుదల అవుతోంది. ఈ విషయమై అధికారిక ప్రకటన ఇటీవల విడుదల అయ్యింది. ఈ సినిమా డిస్నీ + హాట్‌స్టార్‌లో విడుదల అవుతుంది. కేవలం తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగు, కన్నడ మలయాళం, హిందీ భాషల్లో కూడా సినిమా జూలై 8 నుండి ప్రసారం అవుతుంది. ఈ సినిమా కోసం ఇప్పుడు ప్రేక్షకులు అందరూ ఎదురుచూస్తున్నారు.


End of Article

You may also like