Ads
ప్రపంచ కుబేరుల వార్తలు ఎప్పుడు వచ్చిన వారెన్ బఫెట్ పేరు లేనిదే ఆ చర్చ పరిసమాప్తం కాదు. వారెన్ బఫెట్ పెట్టుబడుల్లో ఓ కొత్త ఒరవడిని సృష్టించారు. ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగానే కాకుండా దాతృత్వంలోనూ ఆయన దిట్ట అని నిరూపించుకున్నారు.
Video Advertisement
“డబ్బుతో ఏదైనా కొనొచ్చు. కానీ ప్రేమను కొనలేం. అలాంటి ప్రేమ ఎదుటి వారిని నుంచి పొందాలంటే.. మనం కూడా వాళ్లని ప్రేమించాలి.” అంటూ సక్సెస్‌కి విభిన్నమైన నిర్వచనం చెప్పారు వారెన్ బఫెట్. కేవలం మాటలు చెప్పడమే కాదు, చేతల్లో కూడా చేయిస్తున్నారు. మరణించిన అనంతరం తన ఆస్తిని ప్రపంచవ్యాప్తంగా పిల్లల సేవింగ్స్ బ్యాంకులు తెరిచి.. వాళ్ల అకౌంట్‌లలో వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
బఫెట్ ఆస్తుల వివరాలు..
బెర్క్‌షేర్ హత్‌వే కంపెనీ సీఈవోగా ఉన్న బఫెట్ 2006లో తన స్టాక్‌లో 85 శాతం ఛారిటీకి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం..ఎక్కువ భాగం గేట్స్ – మిలిండా ఫౌండేషన్ కు కేటాయించారు. బఫెట్ మొత్తం 90 బిలియన్ డాలర్ల బెర్క్ షైర్ వాటాలో 56 బిలియన్ డాలర్లు గేట్స్ ఫౌండేషన్ కు, 17.4 బిలియన్ డాలర్లు నాలుగు కుటుంబ సభ్యుల ఛారిటీ సంస్థలకు దానం చేయగా.. మిగిలిన 18 బిలియన్ డాలర్ల మొత్తాన్ని ఏం చేస్తారనేది.. ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది.
పిల్లల అకౌంట్‌లకి డబ్బులు..
ఈ నేపథ్యంలో గేట్స్ ఫౌడేషన్ మాజీ ఉద్యోగి వాల్ స్ట్రీట్ జర్నల్ తో మాట్లాడుతూ.. గేట్స్ ఫౌండేషన్ విరాళాలు అందించే దాతలు ఎక్కువ మంది ఉన్నారు. బఫెట్ దానం చేయగా మిగిలిన మొత్తాన్ని ఎవరికి ఇవ్వాలనేది ప్రశ్నార్ధకంగా మారింది. అందుకే బఫెట్ తన ఆస్తుల్ని ఎవరికి ఇవ్వాలో బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ అధినేత బిల్ గేట్స్‌తో ఓ ప్రతిపాదన ఉంచినట్లు ఆ సంస్థ మాజీ ఉద్యోగి బహిర్గతం చేశారు.
ఇందులో తాను(వారెన్ బఫెట్) మరణించిన 10ఏళ్ల లోపు తన బిలియన్ డాలర్ల ఆస్తుల్ని ఖర్చు చేయాలి. ప్రత్యేకంగా పిల్లల కోసం ప్రపంచవ్యాప్తంగా బ్యాంకుల్ని ఏర్పాటు చేయడం, అకౌంట్‌లను ఓపెన్ చేసి అందులో పిల్లల పేర్ల మీద డబ్బులు వేయడం.”
గేట్స్ ఫౌండేషన్ ఏం చెబుతుందంటే..
ఆగస్ట్ 30తో 92వ ఏట అడుగుపెట్టనున్న వారెన్ బఫెట్.. మరణానంతరం తన సంపదను ఎలా పంపిణీ చేస్తారనే వివరాలను వెల్లడించలేదు. అయినప్పటికీ గేట్స్ ఫౌండేషన్ వరల్డ్ వైడ్‌గా ప్రతి బిడ్డకు పంపిణీ చేసే మొత్తం బఫెట్ సమకూరిస్తే.. విశ్వంలో ఉన్న పిల్లలందరూ సామాజిక ఆర్థిక సమస్యల్ని అధిగ మించవచ్చు. అదే సమయంలో వారి తల్లిదండ్రులు ఆర్ధిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చని గేట్స్ ఫౌండేషన్ అభిపప్రాయం వ్యక్తం చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది.
వారెన్ బఫెట్ తన 94% ఆస్తులను 60 ఏళ్ల తర్వాత సంపాదించినవే, సోషల్ మీడియాకు, స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండే వారెన్ ఎక్కువగా పుస్తకాలు చదువుతూ, పిల్లలతో గడుపుతూ ఉంటాడు. కేవలం పదకొండేళ్ల వయసులోనే వారెన్ షేర్లు కొనడం ప్రారంభించి.. నేడు అపర కుబేరుడిగా ఎదిగాడు.
End of Article