Home Filmy Adda అచ్చం అలియా భట్ లా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? వైరల్ అవుతున్న ఫోటోలు!

అచ్చం అలియా భట్ లా ఉన్న ఈ అమ్మాయి ఎవరో తెలుసా..? వైరల్ అవుతున్న ఫోటోలు!

by Anudeep

బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కు తెలుగు నాట కూడా ఫాలోయింగ్ ఎక్కువ ఉన్న సంగతి తెలిసిందే. థియేటర్లలో విడుదలై రికార్డులు బద్దలు కొట్టిన ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అలియా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. రెండు నెలల క్రితమే తనకంటే పదేళ్లు పెద్దయిన రణబీర్ కపూర్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది.

అయితే.. ఇటీవలే తాను ప్రెగ్నంట్ అన్న విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించి మరోసారి వార్తలలో నిలిచారు. అయితే.. అచ్చం అలియాను పోలిన మరో అమ్మాయి వెలుగులోకి వచ్చింది.

aliya bhatt

సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటూ ఉంటారు. అలా అలియాను పోలిన ఈ అమ్మాయి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల ఈ అమ్మాయి రీల్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

aliya bhatt 1

ఈ అమ్మాయి పేరు సెలెస్టీ బైరాగి. చూడడానికి తాను అచ్చం అలియా లా ఉన్నప్పటికీ.. నేను అలియాను కాదని, అలా అలియా కు డూప్లికేట్ గా ఉండడం కూడా తనకి ఇష్టం లేదని చెబుతోంది ఈ అమ్మాయి. తనకి అలియా అంటే ఇష్టమేనని, ఎప్పుడూ ఆమె చూపే స్వచ్ఛమైన నవ్వు తనకిష్టమని.. నా ఫేవరెట్ యాక్ట్రెస్ అయిన అలియాలా నేను కూడా నటిగా పేరు తెచ్చుకోవాలని పేర్కొంది. ఈమెకు సంబంధించిన రీల్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Watch Reel:

https://www.facebook.com/reel/1329017177625381?fs=e&s=cl

 

You may also like