Ads
ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. ప్రేమ గుడ్డిదని కూడా చెబుతుంటారు. కానీ కొందరు ప్రేమికులను చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రేమకు వయసుతో సంబంధం లేదని అంటుంటారు. ప్రేమ గుడ్డిదని కూడా చెబుతుంటారు. కానీ కొందరు ప్రేమికులను చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. ప్రేమికుల మధ్య పది పదిహేనేళ్ల వయసు వ్యత్యాసం ఉంటేనే ఆశ్చర్యంగా చూసే ఈ రోజుల్లో.. ఈ జంటను చూస్తే నోరెళ్లబెడతారు. వీరిద్దరి మధ్య ఏకంగా 37 సంవత్సరాల వయసు వ్యత్యాసం ఉంది.
Video Advertisement
ప్రేమ ఎప్పుడు ఎవరిమీద ఎలా కలుగుతుందో చెప్పలేం. ఒకసారి ప్రేమ పుట్టిన తరువాత దాని కోసం ప్రేమికులు ఎంత దూరం అయినా వెళ్తుండడాన్ని మనం చూస్తూనే ఉంటాం. కొందరు లైఫ్ లో బాగా సెటిల్ అయిపోయిన వారిని చూసి పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంటారు.
మరికొందరు ఈ క్యాష్ ఫీలింగ్స్ ను క్యాస్ట్ ఫీలింగ్స్ ను పట్టించుకోకుండా స్వచ్ఛంగా ప్రేమిస్తుంటారు. అయితే.. వీరిలో కొందరు వయసు వ్యత్యాసాలను కూడా పట్టించుకోరు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే జంట కూడా ఈ కోవకే చెందుతారు. వివరాల్లోకి వెళితే, యూ ఎస్ కు చెందిన చెరిల్ మెక్ గ్రెగెర్ అనే 61 వృద్ధ మహిళ ఖురాన్ మెక్ కెయిన్ అనే 24 ఏళ్ల వయసు ఉన్న కుర్రాడితో ప్రేమలో పడింది. వీరిద్దరి మధ్య ప్రేమ ముదరడంతో వివాహబంధంతో ఒక్కటవ్వాలనుకున్నారు. వీరి సన్నిహితులెవరూ వీరి పెళ్లిని ఆమోదించకపోయినా వీరు 2021 లో ఒక్కటయ్యారు.
అయితే.. ఇప్పుడు వీరు వీరి ప్రేమకి చిహ్నంగా పిల్లలని కూడా కనాలని భావిస్తున్నారు. అయితే.. వీరిద్దరి మధ్య ఉన్న వయసు వ్యత్యాసం, మరో వైపు చెరిల్ శరీరం కూడా అందుకు సహకరించలేదు. ఎన్నో ఆసుపత్రులు తిరిగినప్పటికీ.. వీరికి పిల్లలు పుట్టే అవకాశం తక్కువని తేలింది. చెరిల్ కు ఇప్పటికే ఏడుగురు సంతానం ఉన్నారు. ఖురాన్ కు మాత్రం ఇదే మొదటిసారి. అయితే ఇందుకోసం వీరు ఏకంగా 1. 14 కోట్లను ఖర్చు చేసి సరోగసి ద్వారా పిల్లలను పొందాలని భావిస్తున్నారు.
ఎంత ఖర్చుకైనా పిల్లల కోసం వెనుకాడబోమని చెప్పిన వీరు ఇప్పటికే సరోగసి ప్రాసెస్ ను స్టార్ట్ చేసేసారు కూడా. 2023 లో వీరికి సరోగసి ద్వారా బిడ్డ పుట్టబోతున్నట్లు ప్రకటించేసారు కూడా. వచ్చే ఏడాది రాబోయే తమ బిడ్డ కోసం ఎంతో ఎక్సయిట్మెంట్ తో ఎదురు చూస్తున్నామని వీరు చెబుతున్నారు. ఖురాన్ 15 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు.. చెరిల్ కొడుకు నిర్వహించే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో పని చేసేవాడు. అప్పటినుంచే వీరిద్దరి మధ్య పరిచయం మొదలైంది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇంతవరకు వచ్చింది. వీరి లవ్ స్టోరీ ని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
End of Article