Ads
మనం సినిమా నచ్చితే ఏ భాషలో అయినా సరే ఒకేలాగా ఆదరిస్తాం. అందుకే మన భాషలోని సినిమాలు వేరే భాషల్లోకి, వేరే భాషల సినిమాలు మన భాషలోకి డబ్ చేస్తూ ఉంటారు. తెలుగులోకి డబ్ అయ్యే సినిమాలు ఎక్కువగా తమిళ్ భాష నుంచి అవుతాయి.
Video Advertisement
తమిళ్ హీరోలు అయిన సూర్య, విక్రమ్, అజిత్, విజయ్, కార్తీ, విశాల్ వీళ్ళందరికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా క్రేజ్ ఉంది. ఇంక సీనియర్ హీరోలు అయిన కమల్ హాసన్ రజనీకాంత్ లాంటి స్టార్ హీరోల గురించి అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల కమల్ హాసన్ హీరోగా నటించిన విక్రమ్ సినిమా తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో కూడా విడుదల అయ్యింది. ఈ సినిమాకి ప్రస్తుతం తెలుగులో కూడా హిట్ టాక్ వస్తోంది.
ఈ సినిమా చివరిలో చూస్తే సూర్య హీరోగా లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతుంది అని విక్రమ్ సినిమా చూసిన వారికి అర్థమయ్యే ఉంటుంది. ఈ సినిమా క్లైమాక్స్ లో చూస్తే సూర్య పాత్రని రోలెక్స్ అనే ఒక పాత్రగా పరిచయం చేస్తారు. సూర్య పాత్ర లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాలో విలన్ పాత్రలో నటించిన అర్జున్ దాస్ తో మాట్లాడుతూ ఉంటారు. ఖైదీ, విక్రమ్, తర్వాత రాబోయే సూర్య సినిమా మధ్యలో ఏదో ఒక కనెక్షన్ ఉంది అని ఇది చూస్తే అర్థమవుతుంది. అయితే అర్జున్ దాస్ పాత్ర ఖైదీ సినిమాలో కార్తీ పోషించిన ఢిల్లీ పాత్ర గురించి మాట్లాడుతాడు.
దీన్ని బట్టి చూస్తే కార్తీ హీరోగా, సూర్య నెగిటివ్ పాత్రలో నటిస్తున్నారు అని అర్థమవుతుంది. దీనిని మల్టీవర్స్ కాన్సెప్ట్ అని అంటారు. ఈ కాన్సెప్ట్ ఇప్పుడు తెలుగు వాళ్లకి కొత్తగా అనిపించినా కూడా చాలా సంవత్సరాల ముందు హాలీవుడ్లో ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు వచ్చాయి. కానీ ఈ కాన్సెప్ట్ మీద కొంత మంది ప్రముఖ డైరెక్టర్లు అంతకుముందు కొన్ని సినిమాల్లో కొన్ని సీన్స్ తీశారు. ఆ డైరెక్టర్లు ఎవరో వాళ్ళు తీసిన సీన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.
#1 ఛత్రపతి
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాలో విలన్ పాత్ర పోషించిన ప్రదీప్ రావత్ పాత్ర, మళ్లీ ఓయ్ సినిమాలో ఒక పాత్రలో కనిపిస్తారు.
#2 రంగం
కె.వి.ఆనంద్ తమిళ దర్శకుడు అయినా కూడా ఆయన సినిమాలు తెలుగులో విడుదల అయ్యాయి. అలా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన రంగం సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అందులో అజ్మల్ అమీర్ పోషించిన ఆ పాత్రకు సంబంధించిన విషయం ఒకటి కె.వి.ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన సూర్య హీరోగా నటించిన బ్రదర్స్ సినిమాలో కూడా చూపిస్తారు.
#3 యమలీల
ఎస్ వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన యమలీల సినిమాలోని తోటరాముడు పాత్ర కూడా ఘటోత్కచుడు సినిమాలో కనిపిస్తారు.
అలా ఈ ముగ్గురు డైరెక్టర్లు అంతకుముందే మల్టీవర్స్ కాన్సెప్ట్ తో వారి పాత్రలని వేరే సినిమాల్లో చూపించారు.
End of Article